Monday, May 20, 2024

Delhi | ఐదేళ్లలో ఏ రాష్ట్రానికీ ప్యాకేజి ఇవ్వలేదు.. లోక్‌సభలో మహారాష్ట్ర ఎంపీల ప్రశ్నకు కేంద్రం సమాధానం

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: గత ఐదేళ్లలో దేశంలోని ఏ రాష్ట్రానికీ ప్రత్యేక హోదా లేదా ప్యాకేజి ఇవ్వలేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. లోక్‌సభలో సోమవారం మహారాష్ట్రకు చెందిన ఎంపీలు గజానన్ కీర్తికర్, కృపాల్ బాలాజీ తుమానే అడిగిన ప్రశ్నలకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి సమాధానమిస్తూ ఈ విషయం వెల్లడించారు.

అయితే కోవిడ్-19 దృష్ట్యా మూలధన వ్యయంలో రాష్ట్రాలకు ప్రత్యేక ఆర్థిక సహాయం అందించే పథకాన్ని మాత్రం కేంద్రం అమలు చేసిందని ఆయన తెలిపారు. ఈ పథకం కింద 50 ఏళ్లలో తిరిగి చెల్లించేలా వడ్డీ లేని రుణాన్ని కేంద్రం సమకూర్చినట్టు వివరించారు. ఈ స్కీమ్ కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 2020-21లో రూ. 688 కోట్లు, 2021-22లో 501.79 కోట్లు, 2022-23లో 6105.56 కోట్లు కేంద్రం విడుదల చేసిందని, అలాగే తెలంగాణ రాష్ట్రానికి 2020-21లో రూ. 358 కోట్లు, 2021-22లో 214.14 కోట్లు, 2022-23లో 2500.98 కోట్లు విడుదలయ్యాయని తెలిపారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement