Tuesday, February 27, 2024

తొమ్మిదేళ్ల తెలంగాణ – ప్ర‌త్యేక పోస్టల్ క‌వ‌ర్ ను విడుద‌ల చేసిన కిష‌న్ రెడ్డి

హైద‌రాబాద్ – తెలంగాణ రాష్ట్రం ఏర్పడి తొమ్మిదేళ్లయిన సందర్భంగా తెలంగాణ తపాలా సర్కిల్ రూపొందించిన ప్రత్యేక కవర్ ను కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి శుక్రవారం ఉదయం హైదరాబాద్ లో విడుదల చేశారు. అలాగే రాష్ట్రంలో బౌద్ధ వారసత్వ ప్రాంతం- భావపూర్ కుర్రుకు సంబంధించిన పోస్టు కార్డుల సెట్ ను కూడా ఆయన ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తపాలా సిబ్బంది సేవలను కొనియాడారు. దేశంలో మారుమూల ప్రాంతాల్లో పౌర సేవలు అందించేలా తపాలా కార్యాలయాలను కేంద్ర ప్రభుత్వం తీర్చిదిద్దుతోందని అన్నారు. తపాలా వ్యవస్థను ఆధునికీకరించినట్లు చెప్పారు. తపాలా ‌సేవలకు తోడుగా పాసుపోర్ట్, ఆధార్, బ్యాంకింగ్ వంటి రంగాల్లో పలు సేవలను తపాలా విభాగానికి విస్తరించినట్లు కిషన్ రెడ్డి తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement