Wednesday, May 22, 2024

రైతులు బలంగా ఉంటేనే న్యూఇండియా సుభిక్షం: ప్రధాని మోడీ

ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి సహా అనేక ఇతర పథకాలు దేశంలోని కోట్లాది మంది రైతులకు కొత్త బలాన్ని అందిస్తున్నాయని ప్రధాని నరేంద్రమోడీ చెప్పారు. రైతులు బలంగా ఉంటేనే న్యూ ఇండియా సుసంపన్నంగా ఉంటుందని అన్నారు. కొత్త పంట సీజన్‌ ప్రారంభాన్ని పురస్కరించుకుని, రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న వివిధ పథకాల ప్రయోజనాల వివరాలను పంచుకుంటూ ఆదివారం ప్రధాని వరుస ట్వీట్‌లు చేశారు. సాధికారత కలిగిన రైతులు సంపన్న దేశానికి కీలకమని పేర్కొన్నారు. దేశం మన రైతు సోదర సోదరీమణులను చూసి గర్విస్తోంది. దేశంలోని రైతులు, మరింత సాధికారత చెందితే నవభారతం మరింత సుభిక్షంగా ఉంటుంది అని ప్రధాని తెలిపారు. ట్వీట్‌లో పంచుకున్న గ్రాఫిక్స్‌ ప్రకారం దేశంలోని 11.3 కోట్ల మంది రైతులు నేరుగా పథకాల నుంచి లబ్ధిపొందుతున్నారు. వారి ఖాతాల్లోకి నేరుగా రూ.1.82 లక్షల కోట్ల రూపాయలు బదిలీ చేయబడ్డాయి. ప్రధాన్‌ మంత్రి సమ్మాన్‌ నిధి కింద రైతులు ఏటా రూ. 6000 నగదు సహాయం పొందుతున్నారని తెలిపారు. ముఖ్యంగా కొవిడ్‌ మహమ్మారి సమయంలో రూ.1.3 లక్షల కోట్లు బదిలీ చేయబడ్డాయని, ఇందులో అధికభాగం చిన్నకారు రైతులకు చేరాయని చెప్పారు.

– అగ్రికల్చరల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఫండ్‌ కింద వ్యవసాయ సంబంధిత మౌలిక సదుపాయాల అభివృద్ధికి రూ. 1 లక్ష కోట్ల రుణసౌకర్యం అందించబడింది. 11,632 ప్రాజెక్టులకు రూ.8585 కోట్ల రుణం లభించింది. పంటకోత అనంతర నిర్వహణ మౌలిక సదుపాయాలు, వడ్డీ ద్వారా కమ్యూనిటీ ఫార్మింగ్‌ ఆస్తుల కోసం ఆచరణీయ ప్రాజెక్టులలో పెట్టుబడికోసం వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి మధ్యస్థ, దీర్ఘకాలిక రుణ ఫైనాన్సింగ్‌ సౌకర్యాన్ని అందిస్తుంది.
– ఈ-నామ్‌ ఫ్లాట్‌ఫారమ్‌లో 1.73 కోట్ల మంది రైతులు పేర్లు నమోదు చేసుకున్నారని ప్రధాని తెలిపారు. ఈ-మార్కెట్‌ రైతులు, వ్యాపారులు, కొనుగోలుదారులకు వస్తువులపై ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌ను సులభతరం చేస్తుంది. మెరుగైన ధరను పొందడంలో సహాయపడుతుంది.
– వసంతకాలం ప్రారంభానికి గుర్తుగా బైసాఖిని జరుపుకుంటారు. ఇది హిందూ నూతన సంవత్సరాన్ని కూడా సూచిస్తుంది. ఈ పండుగ పంటల సీజన్‌ ప్రారంభాన్ని సూచిస్తుంది. భారతదేశం అంతటా పంటకాలాన్ని వివిధ పేర్లతో జరుపుకుంటారు. మహారాష్ట్రలో గుడిపాడ్వా, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో ఉగాది, పంజాబ్‌లో బైసాథి, జమ్ము కాశ్మీర్‌లో నవ్రేహ్‌, పశ్చిమబెంగాల్‌లో పోయిలా బోయిసాఖ్‌, అసోంలో బోహాగ్‌, కేరళలో విషు పేర్లతో పంటసీజన్‌ను పేర్కొంటారు.
– పార్టీ 42వ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏప్రిల్‌ 6 నుంచి ఏప్రిల్‌ 20 వరకు బీజేపీ సామాజిక న్యాయం పక్షాన్ని పాటిస్తోంది. ఏప్రిల్‌ 7నుంచి ప్రతిరోజు ఒక ప్రభుత్వ పథకాన్ని, దాని ప్రయోజనాలను హైలెట్‌ చేస్తోంది. ఈ క్రమంలోనే ఆదివారం ప్రధానమంత్రి మోడీ కిసాన్‌ సమ్మాన్‌ నిధిని హైలెట్‌ చేశారు.

కరోనా ఇంకా అంతరించిపోలేదు..
కరోనా వైరస్‌ ఇంకా అంతరించిపోలేదని, మళ్లి పుంజుకునే ప్రమాదం ఉందని ప్రధాని మోడీ పేర్కొన్నారు. అందుకే కరోనాపై చేస్తోన్న పోరులో ఎట్టిపరిస్థితుల్లోనూ అలసత్వం వహంచవద్దని హెచ్చరించారు. ఎన్నో రూపాలను మార్చుకుంటున్న మ#హమ్మారి మళ్లిd ఎప్పుడు విరుచుకుపడుతుందో ఎప్పటికీ తెలియదన్నారు. ఇటువంటి కరోనా వైరస్‌ వ్యాప్తిని నియంత్రించేందుకు ఇప్పటివరకు 185కోట్ల వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశామన్న ఆయన.. ప్రజల మద్దతుతోనే ఇది సాధ్యమైందని చెప్పారు. అయితే, అత్యంత వేగంగా సంక్రమించే సామర్థ్యమున్నట్లు భావిస్తోన్న ‘ఎక్స్‌ఈ’ వేరియంట్‌ గుజరాత్‌లో వెలుగు చూసిన నేపథ్యంలో ప్రధాని మోడీ మరోసారి అప్రమత్తం చేశారు. గుజరాత్‌లోని జునాగఢ్‌ జిల్లాలో ఓ కార్యక్రమంలో వర్చువల్‌ పద్ధతిలో పాల్గొన్న మోడీ ఈ మేరకు ప్రసంగించారు. ఇదే సమయంలో మాతభూమిని రక్షించుకోవాల్సిన అవసరం ఉందని ఉద్ఘాటించిన మోడీ ఇందుకోసం ప్రకృతి వ్యవసాయం చేసేందుకు ప్రతి గ్రామం నుంచి రైతులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement