Saturday, March 2, 2024

New Couple – మూడు ముళ్లు ఏడు అడుగులు… ఒక్కటైన వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠిలు

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్‌, హీరోయిన్ లావణ్య త్రిపాఠి వేదమంత్రాల సాక్షిగా వైవాహిక బంధంలో అడుగుపెట్టారు. ఇటలీలోని టస్కనీలో వీరి వివాహం బుధవారం రాత్రి ఘనంగా జరిగింది. ఈ వేడుకకు ఇరు కుటుంబాలు, బంధుమిత్రులు సహా టాలీవుడ్ సెలబ్రిటీలు హాజరయ్యారు.బుధవారం రాత్రి వధూవరులిద్దరూ ఒకరి తలపై మరొకరు జీలకర్ర-బెల్లం పెట్టారు. అనంతరం వరుణ్‌.. లావణ్య మెడలో మూడు ముళ్లు వేశాడు. పెళ్లి అనంతరం కొత్త జంట నమస్కరిస్తున్న ఫోటో ఒకటి తాజాగా సోషల్ మీడియాలో ప్రత్యక్షం కాగా క్షణాల్లో వైరల్‌గా మారింది.

ఈ ఫోటో చూసిన అభిమానులు వరుణ్‌-లావణ్యల జంట చూడముచ్చటగా ఉందని కామెంట్లు చేస్తున్నారు. ఈ పెళ్లిలో రామ్‌చరణ్‌, అల్లు అర్జున్‌, నితిన్ తదితర సెలబ్రిటీ కపుల్స్‌ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు

Advertisement

తాజా వార్తలు

Advertisement