Wednesday, May 1, 2024

కుమారైకి మందుతాగించిన సురేఖావాణి-ట్రోల్స్ చేస్తోన్న నెటిజ‌న్స్

క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ సురేఖ వాణి కూతురు సుప్రీతా వీడియోలను, ఫోటోలను షేర్ చేస్తూ సినీ ఇండస్ట్రీలోకి రాకముందే మంచి పాపులారిటీని సొంతం చేసుకుంది. సెలబ్రిటీ హోదాతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న సుప్రీత ఇటీవల పలు కవర్ సాంగ్స్లలో కూడా నటిస్తోంది.. యూట్యూబ్ ద్వారా షార్ట్ ఫిలిమ్స్ లో నటించినట్లు, ఇక ఒక సినిమాలో కూడా అవకాశం వచ్చినట్లు సమాచారం. ఇదిలా ఉండగా తాజాగా సుప్రీతకు దగ్గరుండి మద్యం తాగిస్తూ అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి అడ్డంగా దొరికిపోయింది సురేఖ వాణి. ఇటీవల సుప్రీత పుట్టినరోజు కాగా.. తన తల్లి సురేఖ వాణి అలాగే ఆమె ఫ్రెండ్స్ అందరూ కూడా చాలా గ్రాండ్ గా సుప్రీతా బర్త్ డేను సెలబ్రేట్ చేశారు. తన తల్లి సురేఖవాణి.. కూతురికి మందు తాగించి మరీ బర్త్ డే విషెస్ చెప్పింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు , ఫోటోలు నెట్టింట వైరల్ అవుతూ ఉండగా.. ఒక తల్లివి అయి ఉండి కూతురికి హితబోధ చేయాల్సింది పోయి ఇలాంటి అలవాట్లు నేర్పిస్తావా అంటూ సురేఖ పై నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. అంతేకాదు సుప్రీత డ్రెస్ పై కూడా కామెంట్లు చేస్తున్నారు నెటిజ‌న్స్.

Advertisement

తాజా వార్తలు

Advertisement