Thursday, May 2, 2024

National – భార‌త్ బంద్ సంపూర్ణం! దేశవ్యాప్తంగా రైతుల ఆందోళ‌న‌లు

జాతీయ ర‌హ‌దారుల దిగ్బంధం
ప‌లు చొట్ల రైలు రొకోలు, నిర‌స‌న‌లు
21 డిమాండ్ల‌తో రైతుల ఉద్య‌మం
రైతు సంఘాల‌తో కేంద్రం చ‌ర్చ‌లు
కొలిక్కి రాని మూడో విడ‌త భేటీ
ఇంకాస్త స‌మ‌యం కావాల‌న్న మంత్రులు
మ‌రోసారి స‌మావేశానికి పిలుపు
చ‌ర్చ‌ల ద్వారానే స‌మ‌స్య‌ల‌కు ప‌రిష్కారం
ప్ర‌జ‌లు స‌హ‌క‌రించాల‌ని రైతు సంఘాల పిలుపు

చ‌లో ఢిల్లీకి మద్దతుగా.. రైతులపై కేంద్ర వైఖరిని నిరసిస్తూ శుక్ర‌వారం చేప‌ట్టిన‌ భారత్ బంద్ స‌క్సెస్ అయ్యింది. సంయుక్త కిషాన్ మోర్చా, కేంద్ర కార్మిక సంఘాల పిలుపు మేర‌కు ఉదయం నుంచి బంద్ చేప‌ట్టారు. దేశవ్యాప్తంగా భారత్ బంద్‌లో రైతులు, కార్మికులు, మహిళలు, పలు వర్గాల వారు పాల్గొన్నారు. 21 డిమాండ్లతో సంయుక్త కిసాన్ మోర్చా, కేంద్ర కార్మిక సంఘాలు బంద్‌కు పిలుపునిచ్చాయి. ధరల పెరుగుదల నియంత్రణ, నిత్యావసరాలపై జీఎస్టీ తొలగింపు, పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు, ఆహార భద్రత, అందరికి ఇళ్లు, ఉచిత విద్య, కనీస వేతనం, ఉపాధి కల్పన, రైతుల పంటలకు మద్దతు ధరకు చట్టబద్దత, రుణ మాఫీ, రైతు సమస్యల పరిష్కారం, విద్యుత్ సవరణ బిల్లు ఉపసంహరణ, రైల్వే రాయితీల పునరుద్ధరణ, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ నిలిపివేత సహా కీలక డిమాండ్లతో రైతులు, కార్మికులు, పలు వర్గాల వారు దేశవ్యాప్తంగా రోడ్లపైకి వచ్చి నిరసన తెలుపుతున్నారు. బంద్ సందర్భంగా అత్యవసర సేవలు, బోర్డు పరీక్షలు, విద్యా సంస్థలు, బ్యాంకులకు వినహాయింపు ఇచ్చారు.

చ‌ర్చ‌లు విఫ‌లం.. చ‌లో ఢిల్లీ య‌థాత‌థం

రైతు సంఘాలు, కేంద్రం మధ్య గురువారం రాత్రి సుదీర్ఘంగా సాగిన మూడో దఫా చర్చలు విఫలం అయ్యాయి. కేంద్ర మంత్రులు పియూష్ గోయల్, అర్జున్ ముండా, సహాయ మంత్రి నిత్యానంద రాయ్.. 14మంది రైతు సంఘాల నేతలతో పంజాబ్ సీఎం భగవంత్ మాన్ మూడో విడత చర్చల్లో పాల్గొన్నారు. వీరి మధ్య దాదాపు ఐదు గంటలపాటు చర్చలు జరిగాయి. రైతులపై కేంద్ర ప్రభుత్వం బల ప్రయోగం సరికాదని రైతు సంఘాల నాయకుల దృష్టికి తీసుకెళ్లాయి. టియర్ గ్యాస్ సెల్స్, బుల్లెట్లను కేంద్ర మంత్రులకు రైతు నాయకులు చూపించారు. ఇంటర్నెట్ సర్వీసులు, ఫేస్ బుక్, ట్విట్టర్ అకౌంట్స్ పునరుద్ధరించాలని రైతులు కోరగా.. పంజాబ్ ప్రభుత్వం అందుకు అంగీకరించింది.

కుద‌ర‌ని ఏకాభిప్రాయం..

పంటలకు మద్దతు ధరకు చట్టబద్దత సహా పలు డిమాండ్లపై ఈ భేటీలో ఏకాభిప్రాయం కుదరలేదు. దీంతో మరోసారి భేటీ కావాలని నిర్ణయించారు. ఆదివారం రైతు సంఘాలతో నాలుగోసారి కేంద్రం చర్చలు జరపనుంది. తమ డిమాండ్లు పరిష్కారం అయ్యేవరకు చ‌లో ఢిల్లీ కార్యక్రమాన్ని విరమించేది లేదని రైతు సంఘాలు స్పష్టం చేశాయి.

- Advertisement -

స‌మ‌యం కావాల‌న్నకేంద్రం

చర్చల అనంతరం రైతు సంఘాల నాయకులు మాట్లాడుతూ.. కేంద్ర మంత్రులతో అన్ని అంశాలపై వివరంగా చర్చించామని తెలిపారు. ప్రభుత్వం.. డిమాండ్లను మరింత వివరంగా పరిశీలించాల్సిన అవసరం ఉందని.. కొంత సమయం కావాలని కోరిందని, తదుపరి సమావేశం ఆదివారం ఏర్పాటు చేసిన‌ట్టు చెప్పారు. మా చర్చలు సమస్యలకు పరిష్కారం కనుగొనే లక్ష్యంతో ఉన్నాయని, ఎలాంటి వివాదాలకు తావులేకుండా శాంతియుత పరిష్కారం ఆశిస్తున్నామని రైతు సంఘాల నాయకులు తెలిపారు. ఢిల్లీ వెళ్లాలనే మా ప్రణాళికలో ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేశారు.

చ‌ర్చ‌ల ద్వారానే స‌మ‌స్య‌ల‌కు ప‌రిష్కారం

చర్చల ద్వారానే సమస్యల పరిష్కారం జరుగుతుందని, చర్చలు కొనసాగించాలని నిర్ణయించామని చెప్పారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల త‌ర్వాత రైతు డిమాండ్లపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని కేంద్ర మంత్రులు తెలిపారని అన్నారు. వ్యవసాయం కార్పొరేట్ మయం అయితే అది దేశానికి మంచిది కాదని అన్నారు. రైతు ఆందోళనకు ప్రజలు సహకరించాలని, మద్దతుగా నిలవాలని రైతు సంఘాల నాయకులు కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement