Thursday, May 2, 2024

National – బి జె పి చీఫ్ జేపీ నడ్డా పదవీ కాలం పెంపు

న్యూ ఢిల్లీ – బిజేపీ చీఫ్ జేపీ నడ్డా పదవీకాలాన్ని ఈ ఏడాది జూన్ వరకు పొడిగించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా జనవరిలో ప్రకటించిన ఈ నిర్ణయాన్ని ఆదివారం పార్టీ జాతీయ కౌన్సిల్ ఆమోదించింది. పార్టీ పార్లమెంటరీ బోర్డు ఆమోదానికి లోబడి స్వతంత్రంగా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే అధికారం నడ్డాకు ఇచ్చారు. ఈ నిర్ణయం ఢిల్లీలో జరిగిన బీజేపీ జాతీయ కౌన్సిల్ సమావేశం రెండవ రోజు నుండి వచ్చింది. రాబోయే లోక్‌సభ ఎన్నికల కోసం పార్టీ వ్యూహం, ప్రచారాలను గురించి చర్చించడానికి వేలాది మంది పార్టీ సభ్యులు, అగ్ర నాయకత్వంతో సమావేశమయ్యారు.

అప్పటి పార్టీ చీఫ్ అమిత్ షా కేంద్ర మంత్రి అయ్యాక బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా జేపీ నడ్డా 2019లో బాధ్యతలు చేపట్టారు. నడ్డా 2020లో పూర్తిస్థాయి పార్టీ అధ్యక్ష పదవిని చేపట్టారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నడ్డా పదవీకాలాన్ని జనవరిలో పొడిగిస్తున్నట్లు ప్రకటించిన అమిత్ షా, ‘జేపీ నడ్డా నాయకత్వంలో బీహార్‌లో అత్యధిక స్ట్రైక్‌రేట్‌ను సాధించామని, మహారాష్ట్రలో ఎన్‌డీఏ మెజారిటీ సాధించిందని, ఉత్తరప్రదేశ్‌లో విజయం సాధించింది. పశ్చిమ బెంగాల్‌లో స్థానాల సంఖ్య పెరిగింది. మేము గుజరాత్‌లో కూడా భారీ విజయాన్ని నమోదు చేసాము.” అని వివరించారు. అప్పటి నుండి జేపీ నడ్డా పదవీకాలం పొడిగించే అవకాశం ఉందంటూ ప్రచారం సాగింది. చివరకు అది నిజమైంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement