Sunday, April 28, 2024

Delhi | చేనేత వస్త్రాలపై జీఎస్టీ ఎత్తివేయాలి.. జాతీయ చేనేత విధానాన్ని ప్రకటించాలి : నామ నాగేశ్వరరావు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : రెక్కాడితే గానీ డొక్కాడని చేనేత కార్మికుల బతుకులు బాగు చేసేందుకు జాతీయ చేనేత విధానాన్ని ప్రకటించాలని బీఆర్‌ఎస్ లోక్‌సభా పక్ష నేత నామ నాగేశ్వరరావు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా సోమవారం న్యూఢిల్లీలోని కాన్‌స్టిట్యూషన్ క్లబ్‌లో అఖిల భారత పద్మశాలి సంఘం హ్యాడ్లూమ్ విభాగ్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

చేనేత కార్మిక కుటుంబాలకు  అన్ని విధాలా అండగా ఉంటానని నామ భరోసా ఇచ్చారు. చేనేత రంగ అభివృద్ధికి తెలంగాణా సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఎన్నో ప్రోత్సాహకాలు కల్పిస్తూ పెద్దఎత్తున నిధులు విడుదల చేస్తున్నారని చెప్పుకొచ్చారు. చేనేత ఉత్పత్తులపై జీఎస్టీ ఎత్తివేయాలని ఆయన కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.

అలాగే పోచంపల్లిలో మూతబడిన చేనేత పార్కును తిరిగి ఏర్పాటు చేసేందుకు కేటీఆర్ కేంద్రానికి పలు లేఖలు రాసిన విషయాన్ని నామ వెల్లడించారు. తాను రైతు బిడ్డనన్న నామ నాగేశ్వరరావు, తన తల్లిదండ్రులు చేనేత వస్త్రాలనే ధరించే వారని బాల్య జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement