Thursday, May 2, 2024

నాగ చైత‌న్య‌ ‘క‌స్ట‌డీ’ మూవీ ట్రైల‌ర్ – వీడియోతో

YouTube video

అక్కినేని నాగచైతన్య హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ “కస్టడీ”. తమిళ డైరెక్టర్ వెంకట్ ప్రభు ఈ సినిమాని తెరకెక్కించాడు. తెలుగు,తమిళ బాషల్లో రూపొందుతున్న ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. మే 12న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. మూవీ ప్రమోషన్స్ లో బాగంగా ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ట్రైలర్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఈ సినిమాలో నాగ చైతన్య నిజాయితీ పరుడైన కానిస్టేబుల్ పాత్రలో కనిపించాడు. పోలీస్ కస్టడీలో ఉన్న పేరుమోసిన రౌడీ స్టేషన్ నుండి తప్పించుకుంటాడు. ఆసమయంలో నాగ చైతన్య డ్యూటీలో ఉంటాడు. తాను డ్యూటీలో ఉండగా తప్పించుకున్న రౌడీని, ఆ కానిస్టేబుల్ ఎలా పట్టుకున్నాడు, ఆక్రమంలో తన ఫ్యామిలీ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంది అనేది ట్రైలర్ లో క‌నిపించింది.. యువన్ శంకర్ రాజా బిజీఏం ట్రైల‌ర్ కు బాగా కుదిరింది… ట్రైల‌ర్ అంద‌ర్ని అల‌రించేలానే ఉంది..

Advertisement

తాజా వార్తలు

Advertisement