Wednesday, May 15, 2024

ముత్తయ్య మురళీధరణ్ బయోపిక్‌.. ఎమోషనల్గా ‘800’ ట్రైలర్‌

టెస్ట్‌ క్రికెట్‌ చరిత్రలో 800 వికెట్లు తీసిన ఏకైక బౌలర్‌గా రికార్డులకెక్కిన శ్రీలంక ప్లేయర్ ముత్తయ్య మురళీధరన్‌ జీవితం ఆధారంగా తెర‌కెక్కుతున్న సినిమా ‘‘800 ది మూవీ’’. ఈ సినిమా ట్రైలర్‌ను తాజాగా సచిన్‌ టెండుల్కర్‌ లాంచ్‌ చేశాడు. ముత్తయ్య మురళీధరన్‌ నిజ జీవితంలో ఆయన ఎదుర్కొన్న ఎన్నో సంఘటనలు, ఎత్తుపల్లాలను భావోద్వేగభరితంగా చూపించబోతున్నట్లు ట్రైలర్‌తో క్లారిటీ వచ్చేసింది.

ట్రైలర్‌ చాలా ఆసక్తికరంగా సాగింది. మురళీధరన్‌ పాత్రలో ‘స్లమ్‌ డాగ్‌ మిలియనీర్‌’ ఫేమ్‌ మధుర్‌ మిట్టర్‌ నటిస్తున్నాడు. ఆయన భార్య మదిమలర్‌ పాత్రలో మహిమ నంబియార్‌ నటిస్తుంది. ఈ సినిమా ఆలిండియా పంపిణీ హక్కులు నిర్మాత, శ్రీదేవి మూవీస్‌ అధినేత శివలెంక కృష్ణప్రసాద్‌ సొంతం చేసుకున్నారు. తమిళంలో రూపొందిన ఈ చిత్రాన్ని తెలుగు, హిందీ, ఇంగ్లీష్‌ భాషల్లో విడుదల చేయనున్నారు. అక్టోబర్‌లో సరైన డేట్‌ చూసి ఈ సినిమాను ప్రేక్షకులు ముందుకు తీసుకురావాలని మేకర్స్‌ సన్నాహాలు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement