Friday, May 10, 2024

మునుగోడు ఉప ఎన్నికల్లో సినీ గ్లామర్..ఇంటింటి ప్రచారం నిర్వహించిన జీవిత

మునుగోడు ఉప ఎన్నికల ప్రచారానికి బిజెపి అగ్ర నేతలకు తోడు సినీ గ్లామర్ తోడయింది. బిజెపి అభ్యర్థి తరపున ఇప్పటికే సినీ నటుడు బాబు మోహన్ ప్రచారం చేయగా తాజాగా సినీనటి జీవిత కూడా ప్రచారంలోకి దిగింది. చౌటుప్పల్ మండలం దేవులమ్మ నాగారంలో జీవిత ఇంటింటి ప్రచారం నిర్వహించారు. బిజెపి అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఓటు వేయాలంటూ అభ్యర్థించారు. ఉప ఎన్నికల్లో మహిళా శక్తిని చాటుతారని ఆమె అన్నారు. ప్రజలంతా బిజెపి వైపు ఉన్నారని, మునుగోడులో రాజగోపాల్ రెడ్డి గెలుపు ఖాయమని ఆమె ధీమా వ్యక్తం చేశారు. మరోవైపు మునుగోడు ఉప ఎన్నికను ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో స్థానిక పోలీసులతో పాటు కేంద్ర బలగాలు భారీగా మోహరించాయి. ఉపఎన్నికలు జరుగుతున్న నియోజకవర్గాన్ని తమ ఆధీనంలోకి తీసుకొని పకడ్బందీగా తనిఖీలు చేస్తున్నాయి. నియోజకవర్గంలోకి భారీగా డబ్బు.. మద్యం.. డంపు కాకుండా పెద్ద ఎత్తున తనిఖీలు నిర్వహిస్తున్నాయి. నియోజకవర్గ వ్యాప్తంగా 28 చెక్ పోస్టులను ఎన్నికల అధికారులు ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఐదు కంపెనీల కేంద్ర బలగాలు వచ్చాయి. మరో ఐదు కంపెనీలు రానున్నాయి. నియోజకవర్గ వ్యాప్తంగా సమస్య ఆత్మక ప్రాంతాల్లో ఫ్లాగ్ మార్చ్, రూట్ మార్చ్ లను కేంద్ర బలగాలు నిర్వహించాయి. నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తతలు తలెత్తకుండా ఎన్నికల కమిషన్ చర్యలు చేపట్టింది. విఐపి వాహనాలను కూడా కేంద్ర బలగాలు తనిఖీ చేస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement