Sunday, April 28, 2024

Movie: గ్లోబ‌ల్ కాన్సెప్ట్‌.. ఉప్పెనకు సీక్వెల్‌

వైష్ణ‌వ్ తేజ్‌ని హీరోగా ప‌రిచ‌యం చేస్తూ బుచ్చిబాబు తెరకెక్కించిన రొమాంటిక్ మూవీ ఉప్పెన‌. ఈ సినిమాతో అనూహ్యంగా టాలీవుడ్ లోకి దూసుకు వ‌చ్చి అంద‌రి దృష్టిని ఆక‌ర్షించాడు బుచ్చిబాబు. త్వ‌ర‌లో ఎన్టీఆర్‌తో మూవీ చేయ‌నున్న‌ట్టు ఫిలింన‌గ‌ర్ టాక్ వినిపిస్తోంది.

తాజాగా బుచ్చి బాబు దృష్టిలో ఉప్పెన పార్ట్ 2 ఉంద‌ట‌. ఈ విష‌యాన్ని అత‌నే చెప్పుకొచ్చాడు. ఉప్పెన సినిమా కథ కు కొనసాగింపుగా ఉండే ఉప్పెన 2 కథ కేవలం పాన్ ఇండియా కథ మాత్రమే కాదని.. అదో పాన్ వరల్డ్ కథ గా ఉంటుంద‌న్నాడు. గ్లోబల్ కాన్సెప్ట్ అంటూ బుచ్చి బాబు ఉప్పెన 2 పై అంచనాలు భారీగా పెంచేశాడు. మ‌రి సీక్వెల్‌లో కూడా వైష్ణ‌వ్ ఉంటాడా, లేక మ‌రో హీరో ఉంటాడా అనేది తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement