Wednesday, May 1, 2024

యూపీలో మంకీపాక్స్‌ కలకలం, వైరాలజీ ల్యాబ్‌కు చిన్నారి శాంపిల్‌

ఉత్తరప్రదేశ్‌లో మంకీపాక్స్‌ కలకలం రేగింది. ఘజియాబాద్‌లోని ఒక చిన్నారికి మంకీపాక్స్‌ సోకిందనే అనుమానంతో ఇద్దరు డాక్టర్లు ఆ చిన్నారి శాంపిల్‌ను పూనేలోని నేషనల్‌ ఇన్సిస్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీకి పంపాల్సిందిగా సూచించారని న్యూస్‌ ఏజెన్సీ ఏఎన్‌ఐ శనివారం వెల్లడించింది. ఇండియాలో ఇప్పటి వరకు మంకీపాక్స్‌ కేసు నమోదు కాలేదని, అందువల్ల ప్రజల్లో అనవసర భయాందోళనలు రేపవద్దని కేంద్రం ఇప్పటికే సూచించింది. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ఇద్దరు డాక్టర్లు ఒక చిన్నారిని పరీక్షించారు. చెవి ట్రీట్‌మెంట్‌ కోసం వచ్చిన ఆ చిన్నారిపై ఉన్న పొక్కులు పాక్స్‌ టైపులో ఉన్నాయని, అందువల్ల ఆ చిన్నారి శాంపిల్‌ను పూనేలోని నేషనల్‌ ఇన్సిస్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీకి పంపాల్సిందిగా డాక్టర్లు సూచించారు.

అయితే, అవి మంకీపాక్స్‌ అని కచ్చితంగా నిర్థారించలేమని ఈఎన్‌టీ స్పెషలిస్ట్‌ డా. బిపి త్యాగి అన్నారు. పేషెంట్‌ చెవి సమస్యతో తన వద్దకు వచ్చారని, వంశపారంపర్యంగా ఆ కుటుంబంలో చెవిసమస్యలు ఉన్నాయని ఆయన వెల్లడించారు. చిన్నారిని ఐసోలేషన్‌లో ఉంచడం జరిగిందని, హెల్త్‌ డిపార్టమెంట్‌కు సమాచారం అందించడం జరిగిందని అన్నారు. చిన్నారి సమస్య మంకీపాక్స్‌ అయి ఉండదని, ఎక్కువ మామిడిపండ్లు తినడం వల్ల ఈ సమస్య ఏర్పడి ఉంటుందని ఘజియాబాద్‌ చీఫ్‌ మెడికల్‌ ఆఫీసర్‌ భత్వేస్‌ స్కందర్‌ అభిప్రాయ పడ్డారు.వైరాలజీ ల్యాబ్‌ రిపోర్ట్‌ ఆధారంగా చిన్నారికి మంకీపాక్సా, కాదా అన్నది నిర్థారణ కానుంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement