Thursday, April 25, 2024

వచ్చే ఏడాదిలో మోక్షజ్ఞ ఎంట్రీ..క్లారిటీ ఇచ్చిన బాలకృష్ణ

తాజాగా మరో నట వారసుడు ముందుకు రాబోతున్నాడు. అతను మరెవరోకాదు నందమూరి నటసింహం బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ తేజ. చాన్నాళ్ల నుంచి మోక్షజ్ఞ ఎంట్రీపై చర్చ నడుస్తోంది. ఇదిగో ఈ సినిమాతో వస్తున్నాడు.. ఆ దర్శకుడు పరిచయం చేస్తున్నాడు అంటూ రకరకాల వార్తలు వచ్చాయి. కానీ, దేనిపైనా అధికారిక ప్రకటన రాలేదు. ఈ నేపథ్యంలో స్వయంగా బాలకృష్ణ తన వారసుడి తెరంగేట్రం గురించి తాజాగా మాట్లాడారు. మోక్షజ్ఞను వచ్చే ఏడాది పరిచయం చేస్తున్నట్టు వెల్లడించారు. అయితే, అతని చిత్రానికి దర్శకుడు ఎవరన్న దానిపై ఆయన క్లారిటీ ఇవ్వలేదు. తనకు పలు హిట్స్ ఇచ్చిన బోయపాటి శ్రీను దర్శకత్వంలో మోక్షజ్ఞ తొలి సినిమా ఉంటుందా? అన్న ప్రశ్నకు ఆయన సమాధానం దాటవేశారు. అంతా దైవేచ్ఛ అని నవ్వారు. మరోవైపు బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చి భారీ విజయం సొంతం చేసుకున్న అఖండ సినిమాకు సీక్వెల్ ఉందని బాలయ్య వెల్లడించారు. అఖండ2 కోసం సబ్జెక్ట్ కూడా సిద్ధం అయిందని, ప్రకటనే తరువాయి అని తన అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement