Saturday, September 21, 2024

చంద్ర‌యాన్ 3 ప్ర‌యోగం … ఇస్రో శాస్త్ర‌వేత్త‌ల‌కు మోడీ గుడ్ ల‌క్ సందేశం

ప్యారిస్ – భారత అంతరిక్ష సంస్థ ఇస్రో అత్యంత ప్రతిష్ఠాత్మక చంద్రయాన్‌-3 ప్రయోగానికి సిద్ధమైంది. నేటి మధ్యాహ్నం 2.35 గంటలకు ఎల్‌వీఎం-3 ఎం4 రాకెట్ 140 కోట్ల మంది భారతీయుల ఆశలు, ఆకాంక్షలను మోస్తూ నింగిలోకి దూసుకెళ్లనుంది. దీనిపై ప్రధాని మోడీ ఇస్రో శాస్త్ర‌వేత్త‌ల‌కు గుడ్ లక్‌ సందేశం పంపారు..

‘అంతరిక్ష రంగంలో జులై 14,2023 సువర్ణాక్షరాలతో లిఖించదగ్గరోజు. చంద్రుడిపైకి చంద్రయాన్‌-3 ప్రయాణం మెదలవుతుంది. ఈ మిషన్ కోట్లాది మంది భారతీయుల ఆశలను నింగిలోకి మోసుకెళ్తుంది’ అని మోడీ ట్వీట్ చేశారు. భవిష్యత్తులో జాబిల్లి జనావాసంగా మారొచ్చేమోనని ఆశాభావం వ్యక్తం చేశారు. ‘చంద్రయాన్‌-1 ప్రయోగం ముందువరకు చందమామపై ఒక్క చుక్క కూడా నీరు ఉండదని అభిప్రాయపడేవారు. కానీ తర్వాత ఆ అభిప్రాయం మారింది. ఇక ఇది భవిష్యత్తులో జనావాసంగా మారొచ్చు’అని ఆకాక్షించారు. తాజా ప్రయోగంలో కీలక పాత్ర పోషించిన శాస్త్రవేత్తల కృషిని కొనియాడారు. ప్రస్తుతం ప్రధాని మోడీ ఫ్రాన్స్‌ పర్యటనలో ఉన్నారు. అక్కడి నుంచి ప్రస్తుత ప్రయోగంపై దృష్టి సారించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement