Monday, May 27, 2024

Delhi : కేజ్రీవాల్ ఆరోగ్యం పై అప్ మంత్రి ఆందోళ‌న‌

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఆరోగ్య పరిస్థితిపై ఇవాళ‌ అప్ మంత్రి అతిషి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అరవింద్ కేజ్రీవాల్ గత 20 రోజులుగా జైలులో ఉన్నారు. అతను 30 సంవత్సరాలుగా మధుమేహంతో బాధపడుతున్నారు..

- Advertisement -

అతని షుగర్ స్థాయి 300 దాటింది. మీరు ప్రపంచంలోని ఏ వైద్యుడిని అడిగినా ఇన్సులిన్ లేకుండా షుగర్ లెవల్స్ కంట్రోల్ కాదని చెబుతారు. కేజ్రీవాల్‌కు షుగర్ స్థాయి 300 కంటే ఎక్కువ ఉన్న మధుమేహ వ్యాధిగ్రస్తులకు వారు ఇన్సులిన్‌ను నిరాకరిస్తున్నారని.. మంత్రి అతిషి ఆందోళన వ్యక్తం చేశారు.

ఇదిలా ఉండగా కేజ్రీవాల్ ఇప్పటికే పలు మార్లు తనకు బెయిల్ ఇవ్వాలని కోర్టును ఆశ్రయించగా ప్రతి సారి అతనికి కోర్టులో చేదు అనుభవం ఎదురైంది. మరోపక్క ఈడీ మాత్రం విచారణలో కేజ్రీవాల్ తమకు సహకరించలేదని.. కీలక ఆధారాలు ఉన్న తన ఐఫోన్ పాస్ వర్డ్ చెప్పడం లేదని.. మర్చిపోయానని చెబుతున్నారని.. అందులో ఉన్న డేటా కోసం ఫోన్ ను ఫారెన్సిక్ కు పంపినట్లు కోర్టుకు తెలిపారు. ఈ డేటా వచ్చిన తర్వాత కేజ్రీవాల్ పై వచ్చిన ఆరోపణల పై క్లారిటీ రానుంది. అప్పటి వరకు కేజ్రీవాల్ జైల్లోనే ఉండే అవకాశం కనిపిస్తుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement