Monday, April 15, 2024

సీఎం కేసీఆర్‌ను కలిసిన మంత్రి గంగుల

బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ త‌న జన్మదినం సందర్భంగా సోమవారం సీఎం కేసీఆర్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల సీఎం ఆశీర్వాదం తీసుకున్నారు.

మంత్రి గంగుల చిత్రపటానికి వినూత్నంగా పాలాభిషేకం..
కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రెడ్డవేని మధు ఆధ్వర్యంలో సుమారు 50 మంది ముదిరాజ్ కులస్తులు మంత్రి గంగుల కమలాకర్ జన్మదిన వేడుకను కరీంనగర్ లోయర్ మానేరు డ్యాంలో వినూత్నంగా నిర్వహించారు. మంత్రి గంగుల కమలాకర్ కటౌట్ కు పాలాభిషేకం నిర్వహించారు. మానేరు డ్యామ్ మధ్యలో తెప్పల మీద ప్రయాణిస్తూ కటౌట్లను ప్రదర్శించారు. జై గంగుల జై ముదిరాజ్ అంటూ నినాదాలు చేశారు. కరీంనగర్ నియోజకవర్గం అభివృద్ధికి పాటుపడుతున్న మంత్రి గంగుల కమలాకర్ నిండు నూరేళ్లు జీవించాలని వారు గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement