Wednesday, May 1, 2024

ఓటీటీలోకి రానున్న “మ‌హావీరుడు”.. స్ట్రీమింగ్ రైట్స్ ద‌క్కించుకున్న ప్రైమ్

కోలీవుడ్ హీరో శివకార్తికేయన్.. గత కొన్నేళ్లలో తెలుగులో కూడా మంచి మార్కెట్‌ను ఏర్పాటు చేసుకున్నాడు. రీసెంట్ గా శివకార్తికేయన్ చేసిన ‘డాక్టర్’, ‘డాన్’ అయితే తెలుగులో కొంతమంది డిస్ట్రిబ్యూటర్లకు మంచి లాభాలు తెచ్చిపెట్టాయి.

ఇక అదే జోరుతో తన లేటెస్ట్ మూవీ ‘మహావీరుడు’ కూడా తెలుగులో విడుదల చేశాడు శివకార్తికేయన్. శివకార్తికేయన్, అదితి శంకర్ జంటగా నటించిన ఈ మూవీకి మడోన్ అశ్విన్ దర్శకత్వం వహించాడు. ఈ మూవీ తెలుగు, తమిళంలో జులై 14న విడుదలై పాజిటివ్ రివ్యూలను సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు ఈ మూవీ ఓటీటీలో రిలీజ్ అయ్యేందుకు సిద్దంగా ఉంది.

ఈ మూవీ డిజిట‌ల్ స్ట్రీమింగ్ రైట్స్‌ని ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ‌ అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుంది. కాగా, తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా ఆగస్ట్ 11 నుండి స్ట్రీమ్ కానుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement