Friday, May 3, 2024

ఫ్రాన్స్‌ అధ్యక్షుడిగా మళ్లీ మేక్రాన్‌.. రెండోసారి గెలుపొంది రికార్డు..

ఫ్రాన్స్‌ అధ్యక్షుడిగా ఇమ్మాన్యుయేల్‌ మేక్రాన్‌ మరోసారి ఎన్నికయ్యారు. మరో ఐదేళ్లపాటు పదవిలో కొనసాగనున్నారు. ఈ ఎన్నికల్లో మేక్రాన్‌ స్పష్టమైన మెజారిటీతో విజయం సాధించారు. ప్రత్యర్థి మెరీన్‌ లీ పెన్‌పై మేక్రాన్‌ గెలుపొండం ఇది రెండోసారి. ఆదివారం పెలువడి ఫలితాల్లో మాక్రాన్‌కు 58 శాతం ఓట్లు రాగా, పెన్‌కు 42 శాతం ఓట్లు పడ్డాయి. గడిచిన 20 ఏళ్ల కాలంలో వరుసగా రెండు సార్లు అధ్యక్షుడైన వ్యక్తిగా ఆయన రికార్డు సృష్టించారు.

కాగా, 1969 తర్వాత ఫ్రాన్స్‌లో భారీసంఖ్యలో ఓటర్లు ఎన్నికలకు దూరంగా ఉండటం ఇదే మొదటిసారి. అయితే ఆయన గెలుపు పట్ల దేశంలోని యువత అంసంతృప్తి వ్యక్తంచేశారు. ఆదివారం రాత్రి పారిస్‌ వీధుల్లో భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. దీంతో పోలీసులు వారిపై లాఠీలు ఝులిపించారు. భాష్పవాయు గోళాలు ప్రయోగించారు. ఇమ్యాన్యుయెల్‌ వ్యతిరేకంగా సెంట్రల్‌ పారిస్‌లోని చాట్‌లెట్‌ సమీపంలో గుమిగూడిన యువకులను పోలీసులు చెదరగొట్టారు. యూనివర్సిటీల్లో విద్యార్థులు నిరసన తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement