Saturday, May 4, 2024

లోక్‌సభ నిరవధిక వాయిదా

దేశంలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరుగుతున్న ఎఫెక్ట్ పార్లమెంట్ సమావేశాలపై పడింది. కరోనా కేసుల కారణంగా లోక్‌సభను నిర్ణీత సమయాని కంటే ముందే నిరవధిక వాయిదా వేశారు. పార్లమెంట్ సమావేశాలకు ఎంపీలు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వస్తుండటంతో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. లోక్‌సభలో ఎక్కువగా ఎంపీలు, సెక్యూరిటీ, ఇత‌ర‌త్రా సిబ్బంది అంతా క‌లిసి ఎక్కువగా ఒకే చోట కలుస్తున్నారు. దీంతో ఇప్ప‌టికే ప‌లువురు ఎంపీలు క‌రోనా బారిన ప‌డ్డారు. ఈ నేప‌థ్యంలో ఏప్రిల్ 8వ‌ర‌కు సాగాల్సిన లోక్ స‌మావేశాల‌ను అర్ధాంత‌రంగా ముగించారు. స‌భ‌లో ద్ర‌వ్య‌వినిమియ బిల్లుకు ఆమోద‌ముద్ర వేసిన అనంత‌రం స‌భ‌ను నిర‌వ‌ధికంగా వాయిదా వేస్తున్న‌ట్లు స్పీక‌ర్ ప్ర‌క‌టించారు. అటు రాజ్య‌స‌భ కూడా ముందే వాయిదా ప‌డ‌నుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement