Tuesday, June 18, 2024

పరిశోధన అభివృద్ధికి నిధుల లేమి.. నాణ్యమైన మానవ వనరులు తక్కువే: సీఐఐ నివేదిక వెల్లడి

మన దేశం ఎలక్ట్రానిక్‌ రంగంలో ప్రపంచ దేశాలతో పోటీపడాలని ఉవ్విళ్లూరుతున్నప్పటికీ దేశీయంగా పరిశోధన-అభివృద్ధి (ఆర్‌అండ్‌డీ) పై చేస్తున్న ఖర్చు అతి తక్కువగా ఉంటోంది. ఇది నానాటికి తగ్గిపోతున్నదని భారతీయ పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) నివేదిక వెల్లడించింది. బిల్డింగ్‌ ఇండియాస్‌ ఎక్స్‌పోర్ట్‌ కాంపిటీటీవ్‌నెస్‌ ఇన్‌ ఎలక్ట్రానిక్స్‌ 2025-26 పేరుతో సీఐఐ ఈ నివేదికను విడుదల చేసింది. వియత్నాం వంటి దేశాలతో పోల్చితే మన దగ్గర నాణ్యమైన మానవ వనరులు కూడా లేవని పేర్కొంది. 2025-26 నాటికి భారత్‌ నుంచి ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తుల ఎగుమతులు 120 బిలియన్‌ అమెరికన్‌ డాలర్లకు చేరాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని సీఐఐ పేర్కొంది.

ఇది సాధించాలంటే ఇప్పుడున్న స్థాయి కంటే ఎగుమతులు పది రెట్లు పెంచుకోవా ల్సి ఉంటుందని ఈ లక్ష్యం చేరుకోవాలంటే పరిశోధన- అభివృద్ధికి ప్రత్యేక ప్రోత్సహాకాలు ఇవ్వాలని నివేదిక సూచిం చింది. ప్రస్తుతం మన దేశంలో ఆర్‌ అండ్‌ డీపై జీడీపీలో కేవలం 0.65 శాతం మాత్రమే ఖర్చు చేస్తున్నారు. అభివృద్ధి చెందిన దేశాల తరహాలో దీన్ని 2-3 శాం వరకు తీసుకెళ్లాలని సూచించింది. ప్రస్తుతం ఎలక్ట్రానిక్‌ వస్తువులు తయారువుతున్న చోట ఇన్‌ల్యాండ్‌ కంటెయినర్‌ ఏర్పాటు చేయాలని, దీని వల్ల వేగంగా అనుమతులు పొందేందుకు సాధ్యమవు తుందని సీఐఐ నివేదిక తెలిపింది. ఇది అర్ధికవృద్ధికి దోహదపడుతుందని పేర్కొంది.

పరిశోధనలపై తక్కవ వ్యయం..

మన దేశంలో ఆర్‌ అండ్‌ డీపై చేస్తున్న వ్యయం ఏటా తగ్గిపోతోంది. 2011లో జీడీపీలో 0.76 శాతాన్ని ఖర్చు చేయగా, 2018 నాటికి 0.65 శాతానికి తగ్గింది. ఇదే సమయంలో ప్రపంచం ఈ రంగంపై చేస్తున్న సగటు వ్యయం 2.01 శాతం నుంచి 2.20 శాతానికి పెరిగింది. మన దేశంలో కేటాయిస్తున్న నిధుల్లోనూ 40 శాతం మాత్రమే పారిశ్రామిక రంగం కోసం ఖర్చు చేస్తున్నారు. అందులోనూ కేవలం 5 శాతం మాత్రమే ఎలక్ట్రికల్స్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ కోసం వ్యయం చేస్తున్నారని సీఐఐ నివేదిక ఎత్తి చూపింది. మరో వైపు చైనా మాత్రం ఆర్‌ అండ్‌ డీపై భారీ మొత్తం ఖర్చు చేస్తోంది. ముఖ్యంగా స్మార్ట్‌ రోబోటిక్స్‌, క్లౌడ్‌ డేటా, ఆటోమేటెడ్‌ ఫ్యాక్టరీ టెక్నాలజీలపై ఆ దేశం భారత్‌ కంటే చాలా ముందు నుంచే దృష్టి సారించింది.

వృత్తి శిక్షణా నైపుణ్యం తక్కవే

- Advertisement -

శ్రామిక శక్తి విషయంలో పోటీపడే దేశాల్లో వియత్నాం ఒక్కటే నాణ్యమైన కార్మికులను తయారు చేస్తోంది. ఎలక్ట్రానిక్స్‌ రంగంలో పనిచేస్తున్న ఈ దేశ ఇంజినీర్లు మిగతా దేశాల కంటే అత్యధిక నైపుణ్యం కలిగి ఉన్నారు. ఈ కారణంగానే శామ్‌సంగ్‌ కంపెనీ వియత్నాంలో రెండు ఆర్‌ అండ్‌ డీ సెంటర్లను ఏర్పాటు చేసింది. మన దేశంలో నాణ్యమైన కార్మికులు లభ్యత చాలా తక్కువగా ఉంది. ముఖ్యంగా సం క్లిష్టమైన విడిభాగాలు తయారు చేసే విభాగంలో ఇది కొట్టొచ్చినట్లు కనిపిస్తోందని సీఐఐ నివేదిక పేర్కొంది. సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, ఇంజినీరింగ్‌ మేథమెటిక్స్‌(స్టెమ్‌) విభాగంలో అత్యధికమంది పట్టబద్రులున్న దేశాల్లో మన దేశం రెండో స్థానంలో ఉన్నప్పటికీ వారిలో ఎలక్ట్రానిక్స్‌ రంగానికి అవసరమయ్యే వృత్తిశిక్షణా నైపుణ్యాలు మాత్రం కొరవడ్డాయని పేర్కొంది.

అఖిల భారత ఉన్నత విద్య సర్వే 2019-20 ప్రకారం కొన్నేళ్లుగా సాంకేతికపరమైన యూజీ, పీజీ కో ర్సుల్లో చేరేవారి సంఖ్య క్రమంగా తగ్గిపోతున్నది. ఎంటెక్‌ చేసే వారి సంఖ్య 2015-16లో 2,57,000 మంది ఉండగా, 2019-20 నాటికి ఇది 1,71,000కు పడిపోయింది. ఒక బీటెక్‌లో చేరుతున్న వారి సంఖ్య ఇదే కాలంలో 42 లక్షల నుంచి 36 లక్షలకు పడిపోయింది. ఐటీఐ లాంటి వృత్తివిద్యలో శిక్షణ పొందుతున్న వారి సంఖ్య 12-29 ఏళ్ల వయస్సు వారిలో కేవలం 2.9 శాతానికి మాత్రమే పరిమితమైంది. కొన్నేళ్లుగా ఇలాంటి వారి సంఖ్య పెరుగుతున్నప్పటికీ ఎలక్ట్రికల్‌, పవర్‌, ఎలక్ట్రానిక్స్‌లో శిక్షణ పొందుతున్న వారి సంఖ్య మాత్రం తగ్గిపోతున్నది. 2017-18లో ఈ వృత్తుల్లో శిక్షణ పొందినవారు 11.5 శాతం ఉండగా, 2019-20 నాటికి అది 9.5 శాతానికి పడిపోయిందని సీఐఐ నివేదిక పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement