Friday, May 3, 2024

పినరయి విజయన్ కేబినెట్‌లో కేకే శైలజకు దక్కని చోటు

కేర‌ళ‌లో క‌రోనా క‌ట్ట‌డికి అవిశ్రాంతంగా ప‌ని చేసిన ఆరోగ్య శాఖ మంత్రి కేకే శైల‌జ‌కు చుక్కెదురైంది. మే 20న కొలువుదీరే కొత్త కేబినెట్‌లో ఆమెకు చోటు ద‌క్క‌లేద‌ు. ఆమెకు మంత్రి ప‌ద‌వి కేటాయించ‌కుండా పార్టీ విప్‌గా నియ‌మిస్తార‌ని తెలుస్తోంది. మే 20న 21 మంది ఎమ్మెల్యేల‌తో కొత్త మంత్రివ‌ర్గం ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు ఎల్డీఎఫ్ ప్ర‌క‌టించింది. ఆ జాబితాలో కేకే శైల‌జ పేరు కూడా ఉంది. ఆరోగ్య మంత్రిగానే కొన‌సాగుతార‌ని వార్త‌లు వ‌చ్చాయి. కానీ ఆ త‌ర్వాత మార్పులు చేర్పులు చేసిన క్ర‌మంలో శైల‌జ‌కు కేబినెట్‌లో స్థానం ద‌క్క‌లేద‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. క‌రోనా వైర‌స్‌నే కాదు నిఫా వైర‌స్‌ను కూడా ఆమె ఆరోగ్య శాఖ మంత్రిగా స‌మ‌ర్థ‌వంతంగా ఎదుర్కొగ‌లిగారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement