Sunday, June 16, 2024

పెళ్లి వీడియోని పోస్ట్ చేసిన కియారా..సిద్థార్థ్

తమ ప్రేమని పెళ్లిబంధంగా మార్చుకున్నారు బాలీవుడ్ నటులు కియారా అద్వాని..సిద్ధార్థ్ మల్హోత్రా..ఈ నెల 7న వీరి వివాహం ఘనంగా జరిగింది. రాజస్థాన్‌ జైసల్మేర్‌లోని సూర్యగఢ్‌ ప్యాలెస్‌లో కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. కియారా-సిద్ధార్థ్ పెళ్లికి సంబంధించిన ఓ వీడియోను ఈ జంట తమ సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేసుకుంది. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది.ఈ వీడియోలో కియారా.. ‘షేర్షా’ చిత్రంలోని రాంఝా పాటకు డ్యాన్స్‌ చేస్తూ వివాహ వేదికపైకి చేరుకుంది. అనంతరం కియారా-సిద్ధార్థ్‌ దండలు మార్చుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. వీడియో చూసిన నెటిజన్లు పెళ్లితో ఒక్కటైన నవ దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతూ కామెంట్లు పెడుతున్నారు. ీ వీడియోలో చూడచక్కగా ఉన్నారు ఈ జంట.

Advertisement

తాజా వార్తలు

Advertisement