Saturday, April 27, 2024

Kerala film awards | బెస్ట్​ యాక్టర్​గా మమ్ముట్టి.. చలనచిత్ర అవార్డుల్లో ఏకంగా ఎనిమిది సొంతం!

కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డులను ఇవ్వాల (శుక్రవారం) ప్రకటించారు. ఈ అవార్డులలో కేరళ సీనియర్​ నటుడు మమ్ముట్టి ఏనిమిది చలన చిత్ర అవార్డులను గెలుచుకున్నారు. కేరళ రాష్ట్ర  54వ చలనచిత్ర అవార్డులను తిరువనంతపురంలో ఇవ్వాల ప్రకటించారు. దర్శకుడు గౌతమ్ ఘోష్ నేతృత్వంలోని జ్యూరీ విజేతలను ఎంపిక చేసింది. జ్యూరీ ముందుకు మొత్తం 154 సినిమాలు పరిశీలనకు వచ్చాయి.

– వెబ్​ డెస్క్​, ఆంధ్రప్రభ

తెలుగు తెరకు పరిచమున్న కేరళ నటుడు మమ్ముట్టి తన నటనతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇవ్వాల (శుక్రవారం) ప్రకటించిన అవార్డలలో మమ్ముట్టికి ఏకంగా ఎనిమిది అవార్డులు దక్కాయి. 54వ కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డులను తిరువనంతపురంలో ప్రకటించారు. లిజో జోస్ పెల్లిస్సేరీ చిత్రం ‘నన్‌పకల్ నేరతు మయక్కం’కి తన నటనకు గాను మమ్ముట్టి అవార్డును గెలుచుకున్నారు. ఉత్తమ చిత్రంగా కూడా దీనికి అవార్డు దక్కింది.. ‘రేఖ’లో తన నటనకు గానూ విన్సీ అలోషియస్ ఉత్తమ నటి అవార్డును దక్కించుకుంది.

నటులు కుంచాకో బోబన్, అలెన్సియర్ లే లోపెజ్ వరుసగా ‘న్నా దాన్ కేస్ కోడు’ .. ‘అప్పన్’లో తమ నటనకు ప్రత్యేక జ్యూరీ అవార్డులను గెలుచుకున్నారు. ‘అరిప్పు’ చిత్రానికి గానూ మహేష్ నారాయణన్‌కు ఉత్తమ దర్శకుడిగా అవార్డు లభించింది. పిపి కున్హికృష్ణన్, దేవి వర్మలు ‘న్న దాన్ కేస్ కొడుకు’, ‘సౌదీ వెల్లక్క’ చిత్రాలకు ఉత్తమ క్యారెక్టర్ ఆర్టిస్టులుగా అవార్డులు గెలుచుకున్నారు.

- Advertisement -

‘న్నా దాన్ కేస్ కోడు’ పాపులర్ మూవీ, బెస్ట్ స్క్రీన్ ప్లే సహా ఏడు అవార్డులను గెలుచుకుంది. దర్శకుడు రతీష్ బాలకృష్ణ పొదువాల్ ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే రాశారు. రాజేష్ కుమార్ ఉత్తమ స్క్రీన్ ప్లే (అడాప్టేషన్) గా ‘తెక్కన్ తాళ్లు కేస్’ అవార్డు అందుకున్నారు. “B 32 మ్యూచువల్ 44 వేర్” చిత్రానికి గాను శ్రుతి శరణ్యం స్త్రీ ..  లింగమార్పిడి వ్యక్తి కళాకారిణికి ప్రత్యేక అవార్డును గెలుచుకున్నారు. మిర్దులా వారియర్, కపిల్ కబిలన్ ఉత్తమ గాయకులుగా ఎంపికయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement