Saturday, July 27, 2024

National | అసెంబ్లీలో త‌న‌పైనే విశ్వాస తీర్మానం పెట్టిన కేజ్రీవాల్

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీ అసెంబ్లీలో ఆయన నేడు త‌న‌పైనే విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అనంతరం సభ శనివారానికి వాయిదా పడింది. కేజ్రీవాల్ ప్రవేశపెట్టిన తీర్మానంపై శనివారం సభా కార్యక్రమాలు జరగనున్నాయి. ఈ తీర్మానంపై చర్చ జరగనుంది.

నేడు ఢిల్లీ అసెంబ్లీలో ఆయ‌న మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం తప్పుడు కేసులు బనాయించి ఇతర రాష్ట్రాల్లో పార్టీలను విచ్ఛిన్నం చేయడం.. ప్రభుత్వాలను పడగొట్టడం చూస్తున్నట్లు పేర్కొన్నారు. ఢిల్లీ మద్యం పాలసీ కేసు సాకుతో ఆప్ నాయకులను అరెస్టు చేయాలని కేంద్రం భావిస్తోందని ఆరోపించారు. ఢిల్లీ ఎన్నికల్లో తాము ఎప్పటికీ గెలవలేమని బీజేపీ ప్రభుత్వానికి తెలుసు కాబట్టే.. ఆప్ ఎమ్మెల్యేలను కొనేందుకు ప్రయత్నిస్తున్నారని వ్యాఖ్యానించారు. అందుకే ఆప్ ఎమ్మెల్యేలు ఎవరూ విడిపోలేదని.. వారందరూ చెక్కుచెదరలేదని ప్రజలకు చూపించేందుకు తాను అసెంబ్లీలో బలపరీక్షకు సిద్ధమైనట్లు కేజ్రీవాల్ వెల్ల‌డించారు.. ఇది ఇలాఉంటే ఢిల్లీ అసెంబ్లీలో మొత్తం 70 స్థానాలు ఉన్నాయి. ఆప్‌కు 62, బీజేపీకి 8 స్థానాలు ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement