Monday, April 29, 2024

TS | మోడీ పథకాలకు కేసీఆరే ఆదర్శం.. కేంద్ర తీసుకొచ్చే ప‌థ‌కాల‌కు తెలంగాణే రోల్ మోడల్!

తెలంగాణలో కేసీఆర్ తీసుకువచ్చిన పథకాలను మోడీ సర్కార్ కాపీ కొడుతుందని తెలంగాణ ఫుడ్స్ చైర్మన్ మేడే రాజీవ్ సాగర్ ఎద్దేవా చేశారు. అసలు మోడీ సర్కార్ కు సొంతంగా ఆలోచించే శక్తి లేదని రాష్ట్రాల్లో అమలవుతున్న పథకాలకు పేర్లు మార్చి కేంద్రంలో అమలు చేస్తున్నారని దుయ్యబట్టారు. తెలంగాణలో రైతులకు పెట్టుబడి సాయంగా రైతుబంధును కేసీఆర్ తీసుకువస్తే.. కేంద్రంలో కిసాన్ సమ్మాన్ యోజన అని తీసుకువచ్చారని వివరించారు. అంతేకాకుండా ఇంటింటికి తాగునీరు సరఫరా చేయడానికి మిషన్ భగీరథ పథకాన్ని విజయవంతం పూర్తిచేస్తే దాన్ని ఆదర్శంగా తీసుకుని కేంద్రంలోని బీజేపీ సర్కార్ హర్ ఘర్ జల్ అని ముందుకు వచ్చిందన్నారు.

ఇప్పుడు రాష్ట్రంలో అన్ని వర్గాల వారి అభ్యున్నతికి ఆర్ధిక తోడ్పాటు అందించడానికి దళిత బంధు, బీసీ ఆర్ధిక సాయం, మైనార్టీలకు పాయం చేస్తే దాన్ని కాపీ కొట్టిన మోడీ ఇప్పుడు పీఎం విశ్వకర్మ అంటున్నారని తెలిపారు. దేశానికి కేసీఆర్ లాంటి నాయకుడు కావాలనడానికి ఇదే నిదర్శనమన్నారు. తెలంగాణ ఏర్పాటైన 9ఏళ్లలో ఎంతో అభివృద్ది జరిగిందని తెలిపారు. అన్ని రంగాల్లో తెలంగాణను కేసీఆర్ ఉన్నత స్థానంలో నిలిపారని అన్నారు. ప్రతిసారి కేసీఆర్ మీద నోరు పారేసుకునే బీజేపీ నేతలకు తెలంగాణ పథకాలకు కేంద్రం కాపీ కొడితే కనిపించడం లేదా అని ప్రశ్నించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement