Sunday, May 19, 2024

గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కాళీచరణ్ అరెస్ట్

మ‌హాత్మా గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కాళీచరణ్‌ను ఇవాళ‌ చత్తీస్‌ఘడ్‌ పోలీసులు అరెస్ట్ చేశారు. మధ్యప్రదేశ్‌లోని ఖజురహోలో కాళీచరణ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాళీచరణ్‌ను అక్కడి నుంచి రాయ్‌పూర్‌కు తరలించారు. రాయ్‌పూర్‌లో జరిగిన ధరమ్‌ సన్సద్‌లో గాంధీని కించపరుస్తూ కాళీచరణ్‌ వ్యాఖ్యలు చేశారు.
గత ఆదివారం రాయ్‌పుర్‌లోని రావణ్‌ భాగా మైదానంలో జరిగిన ధర్మ సన్సద్‌లో కాళీచరణ్‌ ప్రసంగిస్తూ జాతిపిత మహాత్మాగాంధీ పైన అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు.. అంతేకాకుండా నాథూరామ్ గాడ్సేను ప్రశంసించారు. మతాన్ని కాపాడుకునేందుకు ప్రజలు ప్రభుత్వాధినేతగా బలమైన హిందూ నాయకుడిని ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు. ఈ నేప‌థ్యంలో పోలీసులు ఆయ‌న్ని అరెస్ట్ చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement