Thursday, April 25, 2024

Notification | జనవరిలో జేఈఈ మెయిన్‌ పరీక్షలు.. రెండో విడత పరీక్షలు ఏప్రిల్‌లో..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: జేఈఈ మెయిన్‌-2023 నోటిఫికేషన్‌ ఎట్టకేలకు విడుదలైంది. దేశంలోని ప్రముఖ విద్యాసంస్థలైన ట్రిపుల్‌ ఐటీలు, ఎన్‌ఐటీ, ఇతర విద్యాసంస్థల్లో ఇంజనీరింగ్‌ కోర్సుల్లో ప్రవేశాలకు ప్రతి సంవత్సరం నిర్వహించే జేఈఈ మెయిన్‌ నోటిఫికేషన్‌ను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) గురువారం విడుదల చేసింది. దరఖాస్తు ప్రక్రియను ఈనెల 15 నుంచి ప్రారంభించినట్లు తెలిపింది. జనవరి 12 వరకు దరఖాస్తులకు తుదిగడువు విధించింది. రెండు విడతల్లో పరీక్షలను నిర్వహిస్తున్నట్లు ఎన్‌టీఏ ప్రకటించింది.

జేఈఈ మెయిన్‌ తొలివిడత పరీక్షలు జనవరి 24, 25, 27, 29, 30, 31 తేదీల్లో నిర్వహించనున్నట్లు తెలిపింది. రెండో విడత పరీక్షలు ఏప్రిల్‌ 6 నుంచి 12 వరకు జరగనున్నట్లు వెల్లడించింది. తెలుగు, ఉర్దూతో సహా మొత్తం 13 భాషల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. బీఈ, బీటెక్‌, బీఆర్క్‌, ఇతర కోర్సుల్లో ప్రవేశాల కోసం ఏటా నిర్వహిస్తున్న జేఈఈ మెయిన్‌ పరీక్షలను దాదాపు 10 లక్షల మంది విద్యార్థులు రాస్తుంటారు. వీరిలో మంచి స్కోర్‌ సాధించిన 2.5 లక్షల మంది విద్యార్థులకు ఐఐటీల్లో ప్రవేశాలకు జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష రాసే అవకాశం కల్పిస్తారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement