Friday, March 1, 2024

ర‌జ‌నీకాంత్ తో జాకీష్రాఫ్.. జైల‌ర్ సెట్ లో బాలీవుడ్ న‌టుడు

త‌మిళ సూపర్ స్టార్ ర‌జ‌నీకాంత్ తాజా చిత్రం జైల‌ర్.. ఈ చిత్రానికి నెల్సన్‌కుమార్‌ దర్శకత్వం వహించారు. తమన్నా హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాను సన్‌ పిక్చర్స్‌ పతాకంపై కళానిధి మారన్‌ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.
సన్‌ పిక్చర్స్‌ బ్యానర్‌లో రూపొందుతున్న ఈ సినిమా గురించి ఎలాంటి అప్‌డేట్‌ వచ్చినా క్షణాల్లో వైరల్‌ అవుతుంది. కాగా ఈ చిత్రంలో హీరోగా ర‌జ‌నీకాంత్ న‌టిస్తున్నారు. తాజాగా చిత్రబృందం ఈ సినిమాకు సంబంధించిన మరో బిగ్‌ అప్‌డేట్‌ను సోషల్‌ మీడియాలో పంచుకుంది.ఈ సినిమా షూటింగ్‌లో జాకీ ష్రాఫ్‌ పాల్గొన్నట్లు చిత్రబృందం ఓ పోస్టర్‌ను రిలీజ్‌ చేసింది. ఈ సినిమాలో జాకీ ష్రాఫ్‌ కీలకపాత్ర పోషిస్తున్నారు. కాగా రజనీకాంత్‌తో కలిసి జాకీష్రాఫ్ గతంలో 1987లో ఉత్తర్‌ దక్షిణ్‌ అనే సినిమాలో నటించారు. మళ్లీ 36ఏళ్ల తర్వాత వీరిద్ధరూ కలిసి స్క్రీన్ షేర్‌ చేసుకోబుతున్నారు. ఇప్పటికే ఈ సినిమా కాస్ట్‌లో రాజ్‌కుమార్‌ రావు, మోహన్‌లాల్‌, సునీల్‌, రమ్యకృష్ణ వంటి స్టార్‌లు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement