Saturday, October 12, 2024

ఓ టీవీ షోలో బూతు మాటలు.. తన భర్తతో రిలేషన్​ కటీఫ్ చెప్పేసిన ఇటలీ ప్రధాని

ఇటలీ ప్రధాని జార్జియా మెలోని తన భాగస్వామి అయిన‌ ఆండ్రియా గియాంబ్రూనోతో విడిపోయినట్లు ఇవ్వాల (శుక్రవారం) సోష‌ల్ మీడియా వేదిక‌గా తెలిపారు. ఈ దంపతులకు ఏడేళ్ల కుమార్తె ఉంది. ‘ఆండ్రియా జియాంబ్రూనోతో దాదాపు 10 సంవత్సరాల పాటు కొనసాగిన నా రిలేషన్​ ఇవ్వాల ముగిసింది” అని ప్రధాని మెలోని తన సోషల్ మీడియా అకౌంట్​లో తెలిపారు.

ఆండ్రియా గియాంబ్రూనో ప్ర‌ముఖ టీవీ ఛానెల్ లో వ్యాఖ్యాతగా పని చేస్తున్నారు. అయితే రీసెంట్ గా టెలీకాస్ట్ అయిన ప్రోగ్రామ్ లో ఆండ్రియా గియాంబ్రూనో అసభ్యకరమైన భాషను ఉపయోగించ‌డం.. ఒక మహిళా సహోద్యోగిపై సెక్సిస్ట్ వ్యాఖ్యలు చేసినందుకు తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. ఆ ఎపిసోడ్ తర్వాత మెలోని తన భాగస్వామి చేసిన వ్యాఖ్యలకు తనను విమర్శించవ‌ద్ద‌ని.. అలాగే, అతని ప్రవర్తన గురించిన తనను అడిగే ప్రశ్నలకు సమాధానం ఇవ్వబోనని చెప్పింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement