Thursday, May 9, 2024

Inner Ring Road – చంద్ర‌బాబుకి మ‌రికాస్త రిలీఫ్…18 వ‌ర‌కు అరెస్ట్ చేయ‌వ‌ద్ద‌న్న హైకోర్టు

అమరావతి : అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్‌మెంటు మార్పు కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు మరికొంత ఊరట లభించింది. నేడు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ ఈ నెల 18కి ఏపీ హైకోర్టు వాయిదా వేయడం జరిగింది. అప్పటి వరకూ ముందస్తు బెయిల్ పొడిగించడం జరిగింది. ఏసీబీ కోర్టులో పీటీ వారెంట్‌పై కూడా అప్పటి వరకూ విచారించవద్దని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ముందస్తు బెయిల్ పిటిషన్‌పై సీఐడీ కౌంటర్ దాఖలు చేసింది. తుది వాదనల కోసం ఈ నెల18 కి వాయిదా వేయడం జరిగింది.


అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్ కేసులో అక్రమాలు జరిగాయని ఏపీలోని జగన్ ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఈ మేరకు గత ప్రభుత్వ హయాంలో స్కాం జరిగిందని సీఐడీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో చంద్రబాబు పేరును కూడా చేర్చింది. ఈ నేపథ్యంలో ఏపీ హైకోర్టులో చంద్రబాబు తరఫు న్యాయవాదులు ముందస్తు బెయిల్ పిటిషన్ నమోదు చేయగా గత బుధవారం ఉదయం విచారణ జరిగింది. ఇటు చంద్రబాబు తరఫు లాయర్ల వాదనలు.. అటు సీఐడీ తరఫు న్యాయవాదుల వాదనలను విన్న హైకోర్టు చంద్రబాబుకు ముందస్తు బెయిల్ ఇస్తున్నట్లు తీర్పు వెల్లడించింది. నేటి వరకూ చంద్రబాబును అరెస్ట్ చేయవద్దని పోలీసులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో పీటీ వారెంట్, పోలీస్ కస్టడీపై ఎలాంటి ఆదేశాలు ఇవ్వొద్దని ఏసీబీ కోర్టుకు హైకోర్టు సూచించింది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement