Friday, May 17, 2024

బదిలీలకు శ్రీకారం.. సుధీర్ఘంగా ఒకేచోట ఉన్న ఉద్యోగులకు స్థానచలనం

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: కీలక శాఖల్లో బదలీలకు సర్వం సిద్దమవుతున్నది. రెవెన్యూ, వాణిజ్య పన్నులు, రిజిస్ట్రేషన్ల శాఖల్లో బదలీలకు సర్వం సిద్దమవుతోంది. ఎన్నికలు పూర్తవడంతో ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నిషేదాన్ని సడలించి ప్రత్యేకంగా బదలీలకు శ్రీకారం చుట్టనున్నట్లు తెలిసింది. తెలంగాణ ఆవిర్భావం తర్వాత తొలిసారిగా ఈ శాఖల్లో బదలీలు అవివార్యంగా మారాయి. త్వరలో ఆయా శాఖల్లో బదిలీలు చేపట్టనున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఇప్పటికే రిజిస్ట్రేషన్ల శాఖలో చురుగ్గా సమాచార సేకరణ జరుగుతోంది. జీవో 91 మేరకు 2017లో 72మంది సబ్‌ రిజిస్ట్రార్లను మూకుమ్మడిగా బదలీ చేసిన ప్రభుత్వం ఆ తర్వాత బదలీలను చేపట్టలేదు.

2014కు ముందుగా జరిగిన సాధారణ బదలీల్లోనే పూర్తయిన ట్రాన్స్‌ఫర్లు సుధీర్ఘ కాలంగా నిల్చిపోయాయి. దీంతో రిజిస్ట్రేషన్ల శాఖ, రెవెన్యూ శాఖ, వాణిజ్య పన్నుల శాఖల్లో బదలీల దిశగా సర్కార్‌ కార్యాచరణ చేస్తోంది. ఈ మేరకు జిల్లాల వారీగా వివరాలను సేకరిస్తోంది. రిజిస్ట్రేషన్ల శాఖలో సబ్‌ రిజిస్ట్రార్లు, రెవెన్యూ శాఖలో తహశీల్దార్లు, డిప్యుటీ కలెక్టర్లు, వాణిజ్య పన్నుల శాఖలోనూ కీలక అధికారుల బదలీల దిశగా కసరత్తు చేస్తున్నారు. ఈ మేరకు ఉద్యోగుల సర్వీస్‌, ప్రస్తుతం పనిచేస్తున్న స్టేషన్‌, ఎంతకాలంనుంచి ప్రస్తుత ప్రాంతంలో పనిచేస్తున్నారు… జోనల్‌ ఏదీ.. కేటాయించిన జిల్లా తదితర వివరాలను సేకరిస్తున్నారు.

అన్ని ప్రభుత్వ శాఖల్లో బదలీల ప్రక్రియ కొంతమేర జరుగగా, ఆదాయ రాబడుల శాఖల్లో వివిధ కారణాలతో నిల్చిపోయాయి. కీలక రాబడి శాఖలైన వాణిజ్య పన్నులు, ఆబ్కారీ, స్టాంపులు-రిజిస్ట్రేషన్ల శాఖలో ఇప్పటికీ బదలీలపై నిషేదం కొనసాగుతోంది. అవినీతి ఆరోపణలతో 2017లో 72 మంది సబ్‌ రిజిస్ట్రార్లను రిజిస్ట్రేషన్ల శాఖ బదలీలు చేసింది. ఇక ఆబ్కారీ శాఖలోనైతే ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన బదలీలే తప్ప ఆ తర్వాత ఎటువంటి కార్యాచరణ జరగలేదు. గతేడాది ఏఈఎస్‌, ఈఎస్‌, సీఐల స్థాయిలో బదిలీలు9 జరిగాయి. అప్పట్లో వీటిపై కొన్ని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇక రెవెన్యూ శాఖలో పలు ఫోకల్‌ పాయింట్లలో బ్యాక్‌గ్రౌండ్‌ ఉన్న ఉద్యోగులే పాతుకుపోయిన పరిస్థితి ఉంది. దీంతో ఆయా శాఖల్లో తీవ్ర ప్రతిష్టంభన నెలకొంది. భూ రికార్డుల ప్రక్షాళన రెవెన్యూ, స్టాంపులు-రిజిస్ట్రేషన్ల శాఖలో అడ్డంకిగా మారాయి. అదేవిధంగా డివిజన్ల సర్ధుబాటు కారణంగా వాణిజ్య పన్నుల శాఖలో బదలీలు నిల్చిపోయాయి. ఆ తర్వాత పునర్‌వ్యవస్థీకరణ పూర్తయింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement