Sunday, June 2, 2024

IND vs AUS T20 | ర‌తురాజ్ సెంచరీ.. ఆసీస్ ముందు భారీ టార్గెట్

భారత్– ఆస్ట్రేలియా మధ్య గౌహతి బర్సపరా స్టేడియం వేదికాగా జ‌రుగుతున్న మూడ‌వ‌ T20 మ్యాచ్ లో టీమిండాయా బ్యాటర్లు అద‌ర‌కొట్టారు. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగింది టీమిండియా 3 వికెట్ల న‌ష్టానికి 222 ప‌రుగులు చేసి.. ఆసీస్ ముందు 223 ప‌రుగుల భారీ టార్గెట్‌ను సెట్ చేసింది.

ఈ మ్యాచ్ లో ఓపెన‌ర్ రుతురాజ్ గైక్వాడ్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. 57 బంతుల్లో (13 ఫోర్లు, 7 సిక్స‌ర్లు) 123 ప‌రుగులు చేసి సెంచ‌రీ (నాటౌట్) సాధించాడు. ఇక కెప్ట‌న్ సూర్య‌కుమార్ యాద‌వ్ 29 బంతుల్లో 39, తిల‌క్ వ‌ర్మ (నాటౌట్) 24 బంతుల్లో 31 ప‌రుగుల‌తో ఆక‌ట్టుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement