Wednesday, April 24, 2024

India Corona | దేశంలో కొనసాగుతున్న కరోనా వ్యాప్తి.. కొత్త కేసులు ఎన్నంటే ?

భారత్‌లో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. క‌రోనా కేసుల సంఖ్య పెరుగుతూ.. త‌గ్గుతూ వ‌స్తున్నాయి. గ‌డిచిన 24 గంట‌ల్లో 782 కొత్త కేసులు నమోదైన‌ట్లు కేంద్ర ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. ప్రస్తుతం దేశంలో 8,675 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. తాజాగా నమోదైన కేసులతో మొత్తం కరోనా బారిన పడిన వారి సంఖ్య 4,49,85,705కి చేరుకోగా.. మహమ్మారి నుంచి ఇప్పటి వరకు 4,44,45,206 మంది కోలుకున్నారు. ఇక నిన్న ఒక్కరోజే 6 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం కోవిడ్‌ మరణాల సంఖ్య 5,31,824కి ఎగబాకింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement