Saturday, June 8, 2024

ఇవ్వాల్టితో ముగియనున్న ఐటీఆర్‌ ఈ- వెరిఫై

ఆదాయపు పన్ను రిటర్న్‌ (ఐటీఆర్‌) 2020-21 సంవత్సరానికి దాఖలు చేసి ఇంకా ఈ-వెరిఫై చేసుకోనివారు వెంటనే చేయాలని ఆదాయపు పన్నుశాఖ అధికారులు తెలిపారు. సాధారణంగా ఐటీరిటర్న్‌లు దాఖలు చేసిన 120రోజుల్లో ఈ-వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ-వెరిఫై చేసుకోకపోతే వాటిని డిఫెక్టివ్‌ రిటర్న్ గా పరిగణిస్తారు. గత రెండేళ్లుగా కరోనా పరిస్థితులు నేపథ్యంలో ఎంతోమంది రిటర్నులు ఈ-వెరిఫైని విస్మరించారు.


దీంతో ఐటీ విభాగం వెరిఫికేషన్‌ కోసం పెండింగ్‌లో ఉన్న అన్ని ఆదాయపు పన్ను రిటర్నులను 28ఫిబ్రవరి 2022వరకు ధ్రువీకరించవచ్చని తెలిపింది. ఈ మేరకు ఆదాయపుపన్ను శాఖ 28 డిసెంబర్‌ 2021న జారీ చేసిన సర్క్యూలర్‌లో తెలిపింది. నేటితో ఈ-వెరిఫై చేసుకునే అవకాశం ముగియనుంది. ఆధార్‌ ఓటీపీ, నెట్‌బ్యాంకింగ్‌, బ్యాంక్‌ఖాతా లేదా డీమ్యాట్‌ ద్వారా ఈ-వెరిఫై చేసుకునేందుకు వీలుంది. లేకపోతే రిటర్ను దాఖలుచేసినా చెల్లదని సంబంధిత అధికారులు తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement