Sunday, April 28, 2024

శృంగారానికి ఒప్పుకోలేదని భార్యను కాల్చిచంపిన భర్త

యూపీలో దారుణ ఘటన వెలుగు చూసింది. సెక్స్ చేసేందుకు ఒప్పుకోలేదని భార్యను భర్త తుపాకీతో కాల్చి చంపాడు. అంతేకాకుండా ఆమె మీద ఉన్న కోపంతో పిల్లలను కూడా పొట్టనబెట్టుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే.. యూపీలోని బసేది గ్రామానికి చెందిన పప్పు (37) అనే వ్యక్తి తన భార్య డాలీ (36)తో కలిసి ఉంటున్నాడు. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. అయితే కొంతకాలంగా డాలీ ముభావంగా ఉంటూ భర్తను దగ్గరకు రానివ్వడం లేదు. ఆమె భర్త పలుమార్లు శృంగారానికి ప్రేరేపించినా డాలీ ఒప్పుకోలేదు. దీంతో పప్పు ఆమెపై కోపం పెంచుకున్నాడు.

ఈ నేపథ్యంలో మంగళవారం నాడు మరోసారి తన భార్యను సెక్స్ చేయాలని కోరాడు. అప్పుడు కూడా డాలీ కుదరదు అని చెప్పడంతో ఘర్షణకు దిగాడు. తనను ఎందుకు దూరం పెడుతున్నావంటూ భార్యను నిలదీశాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య మాటామాట పెరగడంతో పప్పు బీరువాలోని తుపాకీ తీసి భార్య డాలీని కాల్చి చంపాడు. భార్యపై ఉన్న కోపంతో ముగ్గురు పిల్లలను సమీపంలో ఉన్న కాల్వలో పడేశాడు. ఈ ఘటనపై స్థానికులు సమాచారం అందించడంతో పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడు పప్పును అదుపులోకి తీసుకున్నారు. అయితే పిల్లల మృతదేహాల కోసం పోలీసులు గాలించినా ఫలితం దక్కలేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement