Friday, November 8, 2024

మారుతి కార్ల‌పై భారీ డిస్కౌంట్.. ఏ మోడల్​పై ఎంత తగ్గింపు ఇస్తున్నారంటే..

ప్రముఖ కార్ల తయారీ సంస్థ‌ మారుతీ సుజుకి ఇటీవలే మార్కెట్లోకి జిమ్నీ, ఫ్రాంక్స్ వంటి కొత్త మోడళ్లను ప్రవేశపెట్టింది. కాగా, సుజుకి కంపెనీ తమ Swift, Wagon R, Alto K10 కార్ల‌పై డిస్కౌంట్స్ ను ప్రకటించింది. అదే తగ్గింపును Baleno, Ignis, Ciazతో సహా Nexa మోడల్‌లపై రూ. 65,000 వరకు తగ్గింపుతో విక్రయిస్తోంది.

మారుతీ సుజుకి బాలెనో..

మారుతి సుజుకి బాలెనో కారు.. భారతీయ మార్కెట్లో ప్రజాదరణ పొందుతోంది. బాలెనో కారుపై సెప్టెంబరు నెలలో రూ. 35,000 వరకు తగ్గింపు అందుబాటులో ఉంది. ఈ డిస్కౌంట్ తో పాటు వినియోగదారులకు ప్రత్యేక ఆఫర్స్ సహా ఎక్స్ఛేంజ్ ప్రయోజనాలు, పండుగ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. మరీ ముఖ్యంగా సెప్టెంబరు 2 నుంచి సెప్టెంబరు 19 వరకు మధ్య ఈ మోడల్ కారును బుక్ చేసుకున్న వారు అదనంగా మరో రూ. 5 వేలు తగ్గింపును పొందవచ్చు.

- Advertisement -

మారుతీ సుజుకి సియాజ్

మారుతీ సుజుకి కంపెనీ నుంచి మరో మోడల్ కారు సియాజ్ మరింత తగ్గింపుతో మార్కెట్లో విక్రయిస్తున్నారు. ఈ ప్రీమియమ్ సెడాన్ మోడల్ పై దాదాపుగా రూ. 48,000 తగ్గింపుతో అమ్మకానికి ఉంచారు.

మారుతీ సుజుకి ఇగ్నిస్

మారుతి సుజుకి కంపెనీ రిలీజ్ చేసిన ఇగ్నిస్ కారుపై గరిష్టంగా రూ.65,000 వరకు తగ్గింపు అందుబాటులో ఉంది. వాటిలోని ఆటోమేటిక్ మోడల్స్ పై రూ. 55 వేల వరకు తగ్గింపు కూడా వర్తిస్తుంది. నెక్సా లైనప్ లోని ఇగ్నిస్ ను రూ. 5.84 లక్షల (ఎక్స్ షోరూమ్) నుంచి రూ. 8.16 లక్షల (ఎక్స్ షోరూమ్) వరకు విక్రయిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement