Friday, May 3, 2024

ముంబై మెట్రోలో హృతిక్ రోష‌న్ సందడి.. ఫొటోలు వైర‌ల్

బాలీవుడ్ హీరో హృతిక్ రోష‌న్ ముంబై మెట్రోలో సందడి చేశారు. సాధారణంగా ముంబైలో ట్రాఫిక్‌ కష్టాల అధిగమించేందుకు సాధారణ ప్రజలే కాదు సెలబ్రిటీలు కూడా అప్పుడప్పుడు మెట్రోను ఆశ్రయిస్తుంటారు. తాజాగా హృతిక్ కూడా షూటింగ్ కు హాజరయ్యేందుకు మెట్రోలో వెళ్లారు. ఇందుకు సంబంధించిన ఫొటోల‌ను హృతిక్ సోష‌ల్ మీడియాలో పంచుకున్నాడు.

శుక్రవారం షూటింగ్ లొకేషన్‌కు మెట్రోలో వెళ్లినట్లు.. మెట్రోలో చాలా మధురమైన వ్యక్తులను కలిసినట్లు తన పోస్ట్ లో తెలిపారు. ‘‘వేడిని + ట్రాఫిక్‌ను అధిగమించండి. నేను చేయబోయే యాక్షన్ షూట్ కోసం మెట్రోలో వెళ్లి నా వెన్నును కాపాడుకున్నాను” అంటూ హృతిక్ రోష‌న్ కాప్ష‌న్ రాసుకోచ్చారు. ఇక మెట్రోలో హృతిక్ దిగిన‌ ఫొటోలు నెట్టింట్లో వైరల్‌ అవుతున్నాయి.

ఇక గతేడాది విక్రమ్ వేధ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు హృతిక్. అయితే భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. చాలా కాలంగా సరైన బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న హృతిక్ రోషన్‌ తాజాగా సిద్దార్థ్‌ ఆనంద్ దర్శకత్వంలో స్పిరిట్‌ ఆఫ్‌ ఫైటర్ ‌మూవీలో నటిస్తున్నాడు. బాలీవుడ్ భామ దీపికా పదుకొనే ఫీ మేల్ లీడ్ రోల్‌లో నటిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement