ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ క్రూరత్వంపై ఆమెరికా తాజాగా ఒక నివేదిక విడుదల చేసింది. అక్కడ నివశించే ప్రజలు బైబిల్ పట్టుకుంటే ఏకంగా మరణశిక్ష విధిస్తున్నారు.. తాజాగా బైబిల్ తో పట్టుబడిన దంపతులకు మరణశిక్ష విధించిన ఉత్తర కొరియా ఆ దంపతుల చిన్నారి బిడ్డకు జీవితఖైదు విధించింది. ఆ చిన్నారి వయసు రెండేళ్లే. బైబిల్ తో దొరికితే భార్యాభర్తలకు మరణశిక్ష తప్పనిసరి అని, వారి పిల్లలకు, ఇతర కుటుంబ సభ్యులకు జీవితఖైదు విధించడం కిమ్ రాజ్యంగంలో ఒక ప్రత్యేక చట్టాన్నిరూపొందించారు.. ఉత్తర కొరియాలో క్రైస్తవ మతం అవలంబించేవారి పట్ల కిమ్ సర్కారు మృత్యు ఘంటికలు మోగిస్తోంది. అంతేకాదు, వారి కుటుంబసభ్యులను తీసుకెళ్లి ఓ జైలు వంటి శిబిరంలో నిర్బంధిస్తున్నారు. వారక్కడ జీవితఖైదు అనుభవించాల్సిందే. ఈ విధంగా క్రైస్తవం సహా పలు మతాలకు చెందినవారు 70 వేల మంది వరకు జీవితఖైదు అనుభవిస్తున్నారు..
Advertisement
తాజా వార్తలు
Advertisement