Wednesday, May 1, 2024

హీరోయిన్ సాక్షీ వైద్య బ‌ర్త్ డే – ఏజెంట్ పోస్ట‌ర్ రిలీజ్

ఈ సారి ఎలాగైనా బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్టు కొట్టాల‌ని ద‌ర్శ‌కుడు సురేంద‌ర్ రెడ్డితో చేతులు క‌లిపాడు హీరో అఖిల్. ప్ర‌స్తుతం వీళ్ళ కాంబోలో తెర‌కెక్కుతున్న చిత్రం ‘ఏజెంట్‌’. యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కుతున్న ఈ చిత్రం అగ‌స్టు12న విడుద‌ల కానున్న‌ట్లు మేక‌ర్స్ ఇదివ‌ర‌కే ప్ర‌క‌టించారు. అఖిల్ ఈ చిత్రం కోసం పూర్తీగా మేకోవ‌ర్ అయిన‌ట్లు గ‌తంలో విడుద‌లైన పోస్ట‌ర్‌ల‌ను చూస్తే తెలుస్తుంది. కండ‌లు తిరిగిన దేహంతో అఖిల్ ‘రా ఏజెంట్‌’గా ఈ చిత్రంలో క‌నిపించ‌నున్నాడు. ఈ చిత్రంలో అఖిల్‌కు జోడీగా సాక్షీ వైద్య హీరోయిన్‌గా న‌టిస్తుంది. కాగా ఆదివారం ఈమె పుట్టిన‌రోజు సంద‌ర్భంగా మేక‌ర్స్ ఫ‌స్ట్‌లుక్‌ను విడుద‌ల చేశారు.

ఈ పోస్ట‌ర్‌లో సాక్షీ రొమాంటిక్ క‌ళ్ళ‌తో చిన్న‌గా చిరున‌వ్వును ఒలికిస్తూ ఉంది. లేటెస్ట్‌గా విడుద‌లైన ఈ ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్ ప్రేక్ష‌కుల‌ను విపరీతంగా ఆక‌ట్టుకుంటుంది. మ‌ల‌యాళ స్టార్ మ‌మ్ముట్టి కీల‌క‌పాత్ర‌లో న‌టిస్తున్న ఈ చిత్రంపై ప్రేక్ష‌కుల‌లో భారీ అంచ‌నాలే ఉన్నాయి. ఏకే ఎంట‌ర్టైన‌మెంట్స్ బ్యాన‌ర్‌తో క‌లిసి సురేంద‌ర్ రెడ్డి ఈ చిత్రాన్ని స్వీయ నిర్మాణంలో తెర‌కెక్కిస్తున్నాడు. ఇటీవ‌లే అఖిల్ మానాలీ షూటింగ్‌లో దిగిన ఫోటోల‌ను షేర్ చేసిన విష‌యం తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement