Sunday, October 6, 2024

క‌న్న‌డ హీరో ర‌క్షిత్ శెట్టికి ఫోన్ చేసిన – ర‌జ‌నీకాంత్

కన్నడ హీరో రక్షిత్‌ శెట్టి హీరోగా నటించిన ప్రయోగాత్మక మూవీ 777 చార్లీ. సంగీత శ్రింగేరి హీరోయిన్ గా నటించిన ఈ సినిమానికి కె. కిరణ్‌రాజ్‌ దర్శకత్వం వహించారు. ఈ సినిమాను తెలుగులో సురేష్‌ ప్రొడక్షన్స్‌పై హీరో రానా రిలీజ్‌ చేశారు. జూన్‌ 10న విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. ఈ సినిమా చూసిన కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై అయితే ఒక్కసారిగా ఏడ్చేశారు. అంతలా మనసులను కదిలించిందీ చిత్రం. తాజాగా 777 చార్లీ సినిమా వీక్షించారు సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌.

అంతేకాదు సినిమా బాగుందంటూ హీరోకి ఫోన్‌ చేసి సర్‌ప్రైజ్‌ చేశార‌ట. ఈ విషయాన్ని హీరో రక్షిత్‌ శెట్టి సోషల్‌ మీడియాలో రాసుకొచ్చారు. ఈ రోజు ఎంతో గొప్పగా మొదలైంది. రజనీకాంత్‌ సర్‌ ఫోన్‌ చేశారు. 777 చార్లీ చూసి అద్భుతంగా ఉందని ఫీలయ్యారు.ఈ సినిమాను అంత క్వాలిటీగా, ఎంతో లోతుగా టచ్ చేసేలా తీయడం, క్లైమాక్స్‌ తెరకెక్కించిన విధానం, ఆధ్యాత్మిక కోణంలో ముగించడం బాగుందని మెచ్చుకున్నారు. సూపర్ స్టార్ నోటి నుంచి అలాంటి మాటలు వినడం ఎంతో సంతోషంగా అనిపించింది.. థాంక్యూ రజనీకాంత్‌ సర్ అని ట్వీట్‌ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement