Tuesday, April 30, 2024

Big Alert | రెండు రోజులు భారీ వర్షాలు.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీ

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : రాబోయే రెండు రోజులపాటు తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. రాగల 24 గంటల్లో భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. ఉత్తర తెలంగాణలో 8 జిల్లాలకు భారీ వర్ష సూచన ఉందని, ఆసీఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, కరీంనగర్‌, పెద్దపల్లి, ములుగు, భూపాలపల్లి జిల్లాల్‌ఓ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. నల్గొండ, సూర్యాపేట, సిద్ధిపేట, యాదాద్రి , రంగారెడ్డి జిల్లాల్లోనూ బారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ ను జారీ చేసింది. పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్త్తారు వర్షాలు కురుస్తాయని ఓ ప్రకటనలో పేర్కొంది.

వాయువ్య బంగాళాఖాతం పరిసరాల్లో ఒడిశా-పశ్చిమ బెంగాల్‌ తీరాలకు దగ్గరలో ఆవర్తనం ఏర్పడిందని, ఇది సముద్ర మట్టం నుంచి 7.6కిలోమీటర్ల ఎత్తు వరకు కొనసాగుతూ ఎత్తుకు వెళ్లే కొలది నైరుతి దిశ వైపుగా వంపు తిరిగిందని పేర్కొంది. దీని ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్‌ఓ అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అల్పపీడనం ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. రుతుపవనాలు, అల్ప పీడన ప్రభావంతో హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఆదివారం భారీ వర్షాలు కురిశాయి.

కూకట్‌పల్లి, హైదర్‌నగర్‌, నిజాంపేట, ప్రగతి నగర్‌, మూసాపేట, బాచుపల్లి, కేపీహెచ్‌బీ కాలనీల్లో భారీ వర్షం కురిసింది. కాగా రాష్ట్రమంతటా రుతుపవనాలు విస్తరించాయి. రాష్ట్ర వ్యాప్తంగా శనివారం వానలు దంచికొట్టాయి. ఉమ్మడి మెదక్‌, ఆదిలాబాద్‌, కరీంనగర్‌ జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లో రాష్ట్రంలోనే అత్యధికంగా 69.8మిల్లి మీటర్లు, జూబ్లిహిల్స్‌ లో 65 మిల్లిమీటర్లు, సిద్ధిపేటలో 62 మి.మీ. పెద్దపల్లి జిల్లా ముత్తారంలో 48.8 మీ.మీతోపాటు పలుజిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement