Wednesday, May 1, 2024

వడ్డీ రేట్లు ముందే పెంచేసిన‌ హెచ్‌డీఎఫ్‌సి..

దేశంలో ప్రముఖ ప్రవేట్‌ బ్యాంక్‌ హెచ్‌డీఎఫ్‌సి వడ్డీ రేట్లను పెం చింది. ఆర్బీఐ విధాన ప్రకటనకు ఒక రోజు ముందుగానే మంగళవారం నాడు నిధు ల వ్యయ ఆధారిత రుణ రేటును 0.35 శాతం పెంచుతున్నట్లు ప్రకటించింది. స్వల్ప కాలంలోనే ఇలా వడ్డీ రేట్లు పెంచడం ఇది రెండో సారి. దీంతో వడ్డీ రేట్లు 0.60 శాతం పెంచినట్లయింది.

సవరించిన తరువాత బ్యాంక్‌ రుణాల వడ్డీ రేట్లు 7.50 శా తం నుంచి 8.05 శాతాని కి పెరగనున్నాయి. మార్జినల్‌ కాస్ట్‌ ఆధారంగా వడ్డీ రేట్లను సవరించినట్లు బ్యాంక్‌ తెలిపింది. మే నెలలో ఆర్బీఐ 40 బేసిస్‌ పాయింట్లు వడ్డీ రేటు పెంచిన సమయంలో బ్యాంక్‌ 25 బెసిస్‌ పాయింట్లు (0.25 శాతం) పెంచింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement