Saturday, July 27, 2024

HC Judges Comments – “రెండు నిమిషాల సుఖం కోసం” వ్యాఖ్యల‌పై సుప్రీం కోర్టు ఆగ్ర‌హం

న్యూ ఢిల్లీ – అక్టోబర్ నెలలో లైంగిక నేరాలపై కలకత్తా హైకోర్టు న్యాయమూర్తులు సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ(పోక్సో)కేసులో కలకత్తా హైకోర్టు ఇచ్చిన ఆదేశానలు అత్యున్నత న్యాయస్థానం తప్పుపట్టింది. ఈ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సుమోటోగా తీసుకున్న సుప్రీం విచారణ జరిపింది.

”యుక్త వయసులో బాలికలు తమ లైంగిక కోరికలను నియంత్రించుకోవాలని, రెండు నిమిషాల లైంగిక ఆనందం కోసం లొంగకూడదు” అని పోక్సో కేసులో కలకత్తా హైకోర్టు న్యాయమూర్తులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. అయితే న్యాయమూర్తులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేయరాదని, న్యాయమూర్తులు బోధించకూడదని సుప్రీంకోర్టు పేర్కొంది. ఇలాంటి సందర్భాల్లో న్యాయమూర్తులు వ్యక్తిగత అభిప్రాయాలను వ్యక్తం చేయకూడదని చెప్పింది. ”ఈ ఉత్తర్వులు యుక్త వయస్కుల హక్కుల్ని పూర్తిగా ఉల్లంఘించడమే” అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఈ కేసును శుక్రవారం సుప్రీంకోర్టు న్యాయమూర్తులు అభయ్ ఓకా, పంకజ్ మిథాల్ విచారించారు.

మైనర్ బాలికపై అత్యాచారం చేసిన కేసులో దోషిగా తేలిన వ్యక్తిని నిర్దోషిగా ప్రకటిస్తూ.. కలకత్తా హైకోర్టు వ్యాఖ్యలు చేసింది. మైనర్ బాలికపై వ్యక్తి అత్యాచారం చేశాడని, అయితే వీరిద్దరు మధ్య రొమాంటిక్ ఎఫైర్ ఉందని కోర్టు పేర్కొంది. ఇలాంటి సందర్భాల్లో పోక్సో చట్టంపై ఆందోళన వ్యక్తం చేసింది. అబ్బాయిలు లైంగిక కోరికలను అదుపు చేయాలని హైకోర్టు న్యాయమూర్తులు చిత్త రంజన్ దాష్, పార్థ సారథి సేన్‌లతో కూడిన డివిజన్ బెంచ్ సూచించింది.


అలాగే యుక్తవయసులో లైంగిక సంబంధాల ఫలితంగా చట్టపరమైన చిక్కులను నివారించేందుకు విస్తృతమైన లైంగిక విద్యను కోరింది. కౌమారదశలో అబ్బాయిలు, అమ్మాయిలు అనుసరించాల్సిన కొన్ని విధులను సూచించింది. కౌమార దశలో స్త్రీలు తమ శరీర సమగ్రతను కాపాడుకోవడం, గౌరవం, విలువలను కాపడుకోవడం కర్తవ్యం/బాధ్యతగా హైకోర్టు పేర్కొంది. రెండు నిమిషాల పాటు లైంగిక ఆనందాన్ని ఆస్వాదించడానికి లొంగిపోతే సమాజం వారిని చులకనగా చూస్తుందని చెప్పింది. అబ్బాయిలు స్త్రీలను గౌరవించేలా తల్లిదండ్రులు చెప్పాలని కోర్టు పేర్కొంది. దీనిపై సుప్రీం కోర్టు అభ్యత‌రం వ్య‌క్తం చేసింది.. న్యాయ‌యూర్తులు త‌మ తీర్పుల‌లో స్వంత వ్యాఖ్యాన‌లు చేయ‌కూడ‌ద‌ని వ్యాఖ్యానించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement