Friday, May 17, 2024

Delhi | ఢిల్లీలో చేనేత డిక్లరేషన్ రౌండ్ టేబుల్ సమావేశం

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : చేనేతపై విధించిన జీఎస్టీ పన్నును తొలగించాలని అఖిల భారత పద్మశాలి సంఘం చేనేత విభాగం డిమాండ్ చేసింది. సోమవారం న్యూఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్ లో అఖిల భారత పద్మశాలి సంఘం చేనేత విభాగం ఆధ్వర్యంలో ‘జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత డిక్లరేషన్ రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది.

చేనేత ఉత్పత్తులపై కేంద్ర ప్రభుత్వం విధించిన ఐదు శాతం జీఎస్టీని ఎత్తి వేయాలని కోరడంతో పాటు చేనేత రంగం ఎదుర్కొంటున్న ఇతర సమస్యలపై వక్తలు చర్చించారు. ఈ కాన్ఫరెన్సుకు కాంగ్రెస్ పార్టీ ఎంపీలు శశి థరూర్, కార్తీ చిదంబరం, వివేక్ తన్ఖా, ఉత్తమ్ కుమార్ రెడ్డి, బిజూ జనతా దళ్ ఎంపీ అమర్ పట్నాయక్, బిఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వర రావు, సీనియర్ పాత్రికేయులు ఎస్ వెంకట్ నారాయణ హజరయ్యారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement