Sunday, April 28, 2024

GT vs DC | గుజరాత్‌పై ఢిల్లీ ఈజీ విన్..

అహ్మదాబాద్ వేదికగా ఇవ్వాల‌ గుజరాత్ టైటన్స్‌తో జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్‌ ఘ‌న విజయం సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన గుజ‌రాత్ 89 పరుగులకే కుప్పకూలింది. దీంతో 90 పరుగుల టార్గెట్‌తో ఛేజింగ్‌కు దిగిన ఢిల్లీ… 8.5 ఓవర్లలోనే మ్యాచ్‌ను ముగించింది. ఫలితంగా గుజ‌రాత్‌పై 6 వికెట్ల తేడాతో గెలుపొందింది.

ఈ విజయంతో పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్ మూడు స్థానాలు ఎగబాకి 6వ స్థానానికి చేరుకుంది. ఇక 6వ స్థానంలో ఉన్న గుజరాత్ 7వ స్థానానికి పడిపోయింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement