Saturday, April 13, 2024

TS | గుడ్ న్యూస్.. 563 పోస్టులతో గ్రూప్‌-1 నోటిఫికేషన్‌..

తెలంగాణలో గ్రూప్-1 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. గతంలో విడుదల చేసిన పాత నోటిఫికేషన్‌ను రద్దు చేసిన టీఎస్‌పీఎస్సీ.. తాజాగా 563 పోస్టులతో గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ విడుదల చేసింది. డిగ్రీ అర్హత ఉన్న అభ్యర్థుల గ్రూప్-1 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. దీనికి ఈ నెల 23 నుంచి మార్చి 14 వరకు ఆన్‌లైన్‌లోదరఖాస్తులు స్వీకరించనున్నారు.

2022 ఏప్రిల్‌లో 503 పోస్టులతో గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ విడుదలైంది. పేపర్‌ లీకేజీ కారణంగా ఒకసారి ప్రిలిమ్స్‌ను టీఎస్‌పీఎస్సీ రద్దు చేసింది. రెండోసారి ప్రిలిమ్స్‌ నిర్వహించగా హైకోర్టు రద్దు చేసింది. సరైన నిబంధనలను పాటించకపోవడంతో రెండోసారి ప్రిలిమ్స్‌ను రద్దయ్యాయి. ఇటీవల మరో 60 గ్రూప్‌-1 పోస్టులకు ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. గత నోటిఫికేషన్‌లో ఇచ్చిన 503 పోస్టులతో పాటు కొత్తగా కలిపి 60 పోస్టులు కలిపి మొత్తం 563 పోస్టులకు కొత్తగా నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement