Tuesday, May 21, 2024

TS | మహిళలకు గుడ్ న్యూస్ .. త్వరలోనే వ‌డ్డీ లేని రుణాలు

రాష్ట్రంలోని మహిళా స్వయం సహాయక సంఘాలకు కాంగ్రెస్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలో మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు ఇస్తామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క వెల్లడించారు. రాష్ట్రంలో గ‌త కొన్నేండ్లుగా నిలిపివేసిన డ్వాక్రా మ‌హిళ‌ల‌కు రుణాల‌ను తిరిగి ప్రారంభిస్తామ‌ని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని త్వరలో ప్రారంభిస్తామని వెల్లడించారు. అసెంబ్లీ సమావేశాలు శనివారం నుంచి నిరవధికంగా వాయిదా పడటంతో డిప్యుటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క్ భద్రాచలం పర్యటకు వెళ్లారు. అక్కడి ప్రజలతో ముచ్చటించిన అనంతరం ఈ మేరకు ప్రకటన చేశారు.

గతంలో సకాలంలో జీతాలు అందని ప్రభుత్వ ఉద్యోగులకు, ఆశా వర్కర్లు, అంగన్ వాడీ సిబ్బందికి జీతాలకు ఇబ్బంది లేకుండా చేస్తామని భట్టి విక్రమార్క భరోసా ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీ పథకాలతో ఇందిరమ్మ రాజ్యాన్ని సాకారం చేస్తామని పేర్కొన్నారు. కాంగ్రెస్ పాలనలో మహిళలను మహాలక్ష్మిగా చూసుకుంటామని తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క తెలిపారు. ఇప్పటికే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించామని అన్నారు. గృహజ్యోతి, గృహలక్ష్మి పథకాలను కూడా త్వరలోనే అమలు చేయనున్నట్లుగా డిప్యుటీ సీఎం తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement