Saturday, April 27, 2024

ఎస్బీఐ ఖాతాదారులకు శుభవార్త.. ఎఫ్‌డీలపై వడ్డీరేట్లు పెంచే దిశగా అడుగులు..

దేశీయ ప్రభుత్వ రంగ సంస్థ స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా తన ఖాతాదారులకు శుభవార్త తీసుకొచ్చింది. ఫిక్స్‌డ్‌ డి పాజిట్లపై వడ్డీ రేట్లు పెంచే అవకాశం ఉందనే సంకేతాలు ఇచ్చింది. తాజా ద్వైమాసిక నివేదికలో రెపో రేటును 50 బేసిక్‌ పాయింట్ల మేర పెంచిన నేపథ్యంలో ఎస్బీఐ ఓ నిర్ణయం తీసుకోనుంది. ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై వడ్డీరేట్లు పెంచుతామని ఎస్‌బీఐ చైర్మన్‌ దినేష్‌ కుమార్‌ తెలిపారు. 12-24 నెలల వ్యవధి ఖాతాలపై 5.10 వడ్డీరేటు ఇస్తోంది. అలాగే మూడు నుంచి ఐదేళ్ల ఎఫ్‌డీలపై వడ్డీరేటు 5.45 శాతంగా ఉంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement