Thursday, April 25, 2024

Gold Rate Today: మ‌ళ్లీ రికార్డు స్థాయికి బంగారం, వెండి ధ‌ర‌లు..

కొద్ది రోజులుగా బంగారం ధరలు రికార్డు స్థాయికి చేరుకుంటున్నాయి. అంతర్జాతీయంగా బంగారం, వెండి రేట్లు భారీగా పెరుగుతున్నాయి. ఇక దేశీయంగా చూసుకున్నట్లయితే హైదరాబాద్‌లో బంగారం 22 క్యారెట్లకు 10 గ్రాముల ధర ఇవాళ స్థిరంగా కొనసాగుతోంది. ప్రస్తుతం తులం బంగారం రేటు హైదరాబాద్‌లో రూ.55 వేల వద్ద ఉంది. ఇక 24 క్యారెట్ల మేలిమి బంగారం రేటు 10 గ్రాములకు స్థిరంగా కొనసాగుతూ రూ.60,000 వద్ద ఉంది. అయితే, మళ్లీ రూ.60 వేల మార్క్‌ను తాకటం ఆందోళన కలిగిస్తోంది. ఇక దేశ రాజధాని దిల్లీలో బంగారం రేటు 10 గ్రాములకు 22 క్యారెట్ల గోల్డ్ రేటు స్థిరంగా కొనసాగుతూ రూ.55 వేల 150 వద్ద ట్రేడవుతోంది. ఇక 24 క్యారెట్ల బంగారం తులానికి రూ.60,150 వద్ద ఉంది. ఇక వెండి విషయానికి వస్తే హైదరాబాద్‌లో కిలో సిల్వర్ రేటు మూడు రోజుల్లో ఏకంగా రూ.2000 మేర పెరిగింది. ఇవాళ కిలోపై రూ.200 పెరిగింది. ప్రస్తుతం కిలో వెండి రూ.77,700 మార్క్ వద్ద ట్రేడవుతోంది. ఇక దేశ రాజధానిలో చూసుకున్నట్లయితే కిలో వెండి ధర రూ.500 మేర పెరిగింది. ప్రస్తుతం దిల్లీలో కిలో సిల్వర్ రేటు రూ.74 వేల 500 పలుకుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement